- Advertisement -
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గిఫ్ట్ ఇచ్చేశాడు. వినాయక చవితి పండుగకి రెండో టీజర్‌తో సాఫ్ట్ క్యారెక్టర్‌తో దిగిపోయాడు. ఇప్పటికే విడుదలైన ‘జై’ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా లవ కుమార్ క్యారెక్టర్ పరిచయం చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు. బాబీ డైరెక్షన్‌లో వస్తున్న ‘జై లవకుశ’లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.
అభిమానుల అంచనాలకు తగ్గట్లే ‘లవకుమార్’ సాఫ్ట్ లుక్‌లో చితక్కొట్టేశాడు. దీంతో నందమూరి అభిమానులు ఒకరోజు ముందే పండుగ వచ్చేసిందని తెగసంబరపడిపోతున్నారు.
రాశిఖన్నా, నివేదా థామస్‌లు ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ ఈ మూవీలో విలన్ నటిస్తున్నారు.. సెప్టెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ‘జై లవకుశ’ విడుదల కానుంది.
- Advertisement -