అవన్నీ రూమర్స్ మాత్రమే..

239
- Advertisement -

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బిజినెస్‌మేన్ సినిమా తర్వాత పారితోషికం రెట్టింపు చేసి ఆఫర్లు దూరమయ్యేలా చేసుకుందని ఈమధ్య కాలంలో తెగ రూమర్లు వినిపించాయి. అందుకే ఆఫర్లు తగ్గాయని కూడా టాక్.

కానీ.. మళ్లీ వరుసగా సినిమాలు సైన్ చేసి ఆ పేరుని పోగొట్టుకుంది కాజల్. అంతేకాకుండా ఇటీవల కాలంలో చేసిన సినిమాల్లో మంచి పర్‌ఫార్మెన్స్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.

 kajal aggarwal denies hiking remuneration

ఇక కాజల్ అగర్వాల్ సక్సెస్ ట్రాక్‌లో పడింది కదా అని అనుకుంటున్న ప్రస్తుత తరుణంలో మరోసారి ఆమె తన పారితోషికం పెంచిందనే పుకార్లు షికార్లు చేశాయి. ఇదిలావుంటే, తనపై వస్తున్న ఈ కామెంట్స్‌పై స్పందించిన కాజల్.. అవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే అని కొట్టిపారేసింది.

తాను చేసే పనికి తగిన పారితోషికం లభిస్తోంది. అంతకుమించి నిర్మాతలకి భారంగా మారే పని ఏదీ తాను చేయను అని స్పష్టంచేసింది కాజల్ అగర్వాల్.

- Advertisement -