మెగాస్టార్ చిరంజీవి 62వ బర్త్ డే వేడుకలు తెలుగరాష్ట్రాల్లోనే కాదు ఖండంతరాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. చిరు పుట్టినరోజు సందర్భంగా 151వ సినిమా సైనా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి ఫ్యాన్స్‌కు పండగనిచ్చింది చిత్రయూనిట్. వీరందరికీ చిరు ధన్యవాదాలు చెప్పిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. చిరు అభిమానులు నడుపుతున్న ‘చిరంజీవి’ అనే ఫేస్బుక్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
మీరిచ్చిన ఈ ఉత్సాహం, శక్తితో 150 ఏంటి? మరో 150 చిత్రాలు అవలీలగా చేయగలను అనిపిస్తోంది. ఈసారి చిరంజీవిగా కాదు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మిమ్మల్ని కలుసుకుంటాను. మీరు చూపిన ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు’ అని చిరు అభిమానుల్ని ఉద్దేశించి అన్నారు.
పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు, అతిథులు, అభిమానులకు నా నమస్కారాలు. ప్రత్యక్ష్యంగా కలుసుకోలేకపోయినా.. ఈ మాధ్యమం ద్వారా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్న చిరు నా తల్లిదండ్రులు చేసిన పూజలో, నేను చేసుకున్న పుణ్యమో తెలీదు కానీ.. మీలాంటి అభిమానులను పొందగలిగాను.
151వ సినిమాగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథను ఎంచుకున్నా. స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో నటించాలని నాకు చాలా రోజుల నుంచి ఉంది. అందులోనూ భగత్‌సింగ్ పాత్రలో నటించాలని చాలా సార్లు అనుకున్నా. కానీ కుదరలేదు. ఇన్నాళ్లకి ఈ ఉయ్యాలవాడ రూపంలో.. నా ఆశలకు, మీ ఆకాంక్షలకి ప్రతిరూపంగా నిలిచే పాత్ర దొరికింది’.
అదే సమయంలో గట్టి ఛాలెంజ్ కూడా. అత్యుత్తమ సాంకేతిక బృందంతో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో డైనమిక్ డెరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చిత్రం రూపుదిద్దుకుంటోంది. కాబట్టి ఇది ఓ అద్భుత దృశ్యకావ్యం అవుతుందన్న విషయంలో సందేహం లేదు అని చిరంజీవి అన్నారు. ఆ వీడియో మీకోసం…