విజయ్‌దేవర కొండ, షాలిని హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ సంచలనకామెంట్స్ చేశారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న థియేటర్ల కబ్జా దందాను వేలెత్తి చూపారు. కొందరు బడా నిర్మాతల కారణంగా చిన్న సినిమా బ్రతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి నారాయణరావు ఉండి ఉంటే దీని గురురించి ప్రశ్నించే వారన్నారు.
‘‘వస్తు సేవల పన్ను వచ్చాక 20 శాతం అదనపు పన్ను సినిమాపై పడుతోంది. రూ.20 టికెట్టుపై రూ. 3 లేదంటే రూ.4 రూపాయలు మాత్రమే నిర్మాతకి వస్తాయి. ఈ మధ్య నాయకులు, సోషల్ మీడియా సినిమావాళ్లలని పిచ్చోళ్లలాగా చూస్తున్నారు. వూరికే దొరికారు కదా అని ఎవరు పడితే వాళ్లు రాళ్లు విసురుతున్నారు. సోషల్ మీడియాలో ‘అర్జున్ రెడ్డి’ 3 గంటలట సినిమా అంటూ కామెంట్ చేస్తున్నారు కొందరు… వాడికెందుకయ్యా? వాడి అయ్య జాగీరా? మూడు గంటలు సినిమా తీస్తడు, 30 గంటలు సినిమా తీస్తడు. ఏమైతది? వాడి పైసలా? నచ్చకపోతే వాడు చూడొద్దు?… నిర్మాత, దర్శకుడు, హీరో సినిమాను నమ్ముకుని సినిమా తీస్తారు” అన్నారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు అర్జున్ రెడ్డి ముద్దు పోస్టర్లను చించేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ “ఇంకోడెవడో వస్తడు… ముద్దు పెట్టుకున్నారంట ఏందయ్యా అని? విమర్శిస్తడు. ముద్దు పెట్టుకుంటే నీకేందయ్యా? రాకు నువ్వు థియేటర్‌కు? అన్నీ వీళ్లకే కావాలి. పోనీ మంచి సినిమా తీస్తే చూస్తరా? అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు తమ్మారెడ్డి.