సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పైడర్’. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. టాలీవుడ్ అగ్రకథానాయకులలో మహేశ్ బాబుకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను ఆయన సినిమాలకి మంచి మార్కెట్ వుంది. అక్కడ ఆయనకి అభిమానులు ఎక్కువ. అందువలన ఆయన సినిమాలకి లభించే ఆదరణ ఎక్కువ. అయితే ‘స్పైడర్’ రిలీజైన రెండో రోజునే ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘మహానుభావుడు’ సినిమా రెడీ అవుతోంది.
మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శర్వానంద్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం 3 కోట్లను ఆఫర్ చేసిన ఓ బయ్యర్ మహేశ్ సినిమాకి పోటీగా రంగంలోకి దిగుతుందని తెలిసి వెనక్కి తగ్గాడట. మహేశ్ సినిమా బరిలో ఉండగా మరో సినిమాకి బయ్యర్లు దొరకడం కష్టమేననే టాక్ ఎప్పటి నుంచో వుంది. ‘స్పైడర్’ హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ ప్రభావం ‘మహానుభావుడు’పై తీవ్రంగా పడే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. అయినా ఈ సినిమా టీమ్ అదే డేట్ ను ఖాయం చేసుకుంటుందో మనసు మార్చుకుంటుందో చూడాలి.
హరీష్ జైరాజ్ స్వరాలు సమకూరుస్తున్న ఈమూవీ ఒక్కపాట మినహా షూటింగ్ మొత్తం పూర్తైంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈమూవీలో ఎస్.జె సూర్య విలన్‌గా అలరించనున్నారు. ఇదిలా ఉండగా..ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘స్పైడర్’ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్‌లో సందడి చేయనుంది.