మన స్టార్ హీరోలంతా సెంటిమెంటును ఫాలో అయ్యేవాళ్ళే. అందుకే సినీపరిశ్రమలో సెంటిమెంటు కామన్ అయిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ ఇరువురికి దైవంపై నమ్మకం, సెంటిమెంట్ కాస్త ఎక్కువే. మనల్ని నడిపించే ఆ దైవశక్తిని మరువకూడదని భావిస్తారు ఈ ఇద్దరు. చిరు ఏ సినిమా ప్రారంభించినా పూజలు, హోమాలు మస్ట్.. అది దేవుళ్లపై మెగాస్టార్ నమ్మకాన్ని ఎలివేట్ చేస్తుంది.
అందుకే తాజాగా ఈ బుధవారం నాడు ప్రారంభమైన `ఉయ్యాలవాడ నరసింహారెడ్డి` సినిమా కోసం మెగా ఫ్యామిలీ హోమాలు నిర్వహించింది. వాస్తవానికి ఆగష్టు 22 న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా 151వ సినిమా లాంచింగ్ ఉంటుందని ప్రచారమైంది.
కానీ అంతకంటే ముందే ఈ శ్రావణమాసం సెంటిమెంటును మెగాస్టార్ ఫాలో అయ్యారు. ఇక నటసింహా నందమూరి బాలకృష్ణ సెంటిమెంటులో ఓ ఆకు ఎక్కువే.. ప్రాజెక్టు ఏదైనా.. సినిమా, రాజకీయం.. ఇలా పని ఏదైనా.. ప్రతిసారీ ప్రత్యేకించి ఇంట్లో పూజలు చేస్తారు. దైవానికి మొక్కాకే కాలు బయటపెడతారు.
ఈ ఇద్దరి విషయంలోనే కాదు.. ఇండస్ట్రీ ప్రముఖుల్లో ఇలాంటి సెంటిమెంట్లు చాలానే ఉన్నాయి. మొత్తానికి ఈ శ్రావణమాసంలో పలు భారీ ప్రాజెక్టులకు చకచకా ఠెంకాయలు కొట్టేయడం వెనక సెంటిమెంటు బలంగానే పని చేసిందని చెప్పాలి.