వామ్మో… సింగర్ కల్పన ఊపేసింది..

260
singar kalpana
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో మొదట్లో అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు దాంతో ఆ షో పని అయిపోయినట్లే అని అనుకున్నారు అంతా …… కట్ చేస్తే రోజులు మారే కొద్దీ బిగ్ బాస్ రేటింగ్ పెరుగుతూ వస్తోంది . ఇక మిగతా రోజుల్లో ఎలా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ పాల్గొంటున్న శని , ఆది వారాలలో మాత్రం బ్రహ్మాండమైన రేటింగ్ వస్తోంది . తాజా విషయానికి వస్తే నిన్న టి ఆర్ పి రేటింగ్ బీభత్సంగా వచ్చిందట. వారానికొకరి చొప్పున ఎలిమినేట్ అవుతున్న ఈ షోలో.. ఈసారి మాత్రం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు.

శనివారం కత్తి మహేశ్ ఎలిమినేట్ కాగా.. ఆదివారం సింగర్ కల్పన ఎలిమినేట్ అయ్యారు. వెళ్తూవెళ్తూ కల్పన చేసిన పర్ఫార్మెన్స్ బిగ్ బాస్ స్టేజ్ ను ఊపేసింది. అయితే కల్పన హౌస్ లోపల ఎప్పుడూ డబుల్ గేమ్ ఆడుతోందని.. కెమెరాల ముందు అతిగా నటించేస్తోందని.. అదే సమయంలో ఎవ్వరితోనూ సరదాగా ఉండట్లేదని ఆమె మీద విమర్శలుండేవి. సోషల్ మీడియాలో కల్పన మీద చాలానే ట్రోలింగ్ నడిచింది.

ఐతే హౌస్ నుంచి బయటికొచ్చాక మాత్ర కల్పన విశ్వరూపం చూపించింది. ఇంటి సభ్యుల గురించి పాట రూపంలో చెప్పాలంటూ ఎన్టీఆర్ కోరినప్పుడు కల్పన హల్ చల్ చేశారు. ఒక్కొక్కరి గురించి ఒక్కో పాట రూపంలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ముమైత్ ఖాన్ కి చంద్రముఖి సాంగ్ ను అంకితమిస్తూ కల్పన చేసిన పర్ఫార్మెన్స్ కు ఎన్టీఆర్ తో పాటు ఇంటిసభ్యులు కూడా పగలబడి నవ్వారు.

అంతేకాదు.. దీక్ష విషయంలో ప్రిన్స్ వ్యవహరించే శైలి, ఆదర్శ్ బిహేవియర్, హరితేజ ఫీలింగ్స్.. ఇలా అన్నింటినీ కల్పన తనదైన స్టైల్లో ప్రజెంట్ చేశారు. కల్పనలోని రెండో కోణాన్ని చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. మొత్తంగా ఇన్నాళ్లూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న కల్పన.. వెళ్లేటపుడు మాత్రం అందరినీ ఆకట్టుకుంది.

- Advertisement -