బిగ్‌బాస్ గురించి అందరీకి తెలియజేస్తా..!

187
Mahesh katti To Write a book on Bigg Boss show
Mahesh katti To Write a book on Bigg Boss show
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌ చేస్తున్న బిగ్ బాస్ షో తెలుగు టెలివిజన్ చరిత్రలోనే బెగ్గెస్ట్ రియాలిటీ షో. ఇటీవల ప్రారంభమైన ఈ షో 27 ఎపిసోడ్‌లను పూర్తి చేసి 28వ ఎపిసోడ్‌లోకి ఎంటరైపోయింది. ‘బిగ్‌బాస్’ నుంచి ఈ వారం మహేశ్ కత్తి ఎలిమినేట్ అయ్యాడు. హౌస్‌లోని పార్టిసిపెంట్స్‌కి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చిన మహేష్ కత్తి.. బిగ్ బాస్ ‘బాంబు’ను హౌస్‌లోని పార్టిసిపెంట్స్‌లో ఒకరైన ఆదర్శ్‌పై విసిరాడు. వారం రోజులపాటు హౌస్‌లోని అందరి ప్లేట్లు, గ్లాసులు కడగాలని అతనికి ‘పనిష్మెంట్’ ఇచ్చాడు.

బిగ్‌బాస్ హౌస్ విశేషాల గురించి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావించగా.. హౌస్‌లో తాను చాలా నేర్చుకున్నానని, చాలా అనుభవంతో, ఆలోచనలతో బయటకు వచ్చానని చెప్పారు. ఈ షో గురించి అందరికీ తెలియజేసేందుకు త్వరలో పుస్తకం రాస్తానని మహేష్ కత్తి ఈ సందర్భంగా ప్రకటించారు. ఆ పుస్తకంలో తన గురించి కూడా ఒకపేజీ ఉండేలా చూడాలని ఎన్టీఆర్ సరదాగా రిక్వెస్ట్ చేశారు.

kathi-eleminated-1

ఇక ఆదివారం జరిగిన ఎపిసోడ్‌ 29లో ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న కల్పన, దీక్ష, హరితేజలలో సింగర్ కల్పనను బిగ్ బాస్ నుండి సాగనంపారు. దీంతో ఇన్నాళ్లు బిగ్ బాస్ హౌస్‌లో తన ఓవరాక్టింగ్‌తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన కల్పన తన ఫ్లోను కంటిన్యూ చేస్తూనే బిగ్ బాస్‌నుండి నిష్క్రమించింది. ఇక వెళ్తూ .. వెళ్తూ.. తన దైన శైలిలో హౌస్ మేట్స్‌ను తన పాటలతో ఇమిటేట్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక హౌస్ ఉన్న సెలబ్రిటీల గురించి కల్పన అభిప్రాయం తెలియజేయాల్సిందిగా ఎన్టీఆర్ కోరారు. తన అంచనా ప్రకారం బిగ్ బాస్ టైటిల్‌ ప్రిన్స్ గెల్చుకుంటారన్నది. అంతేకాకుండా హౌస్‌లో డబుల్ మైండ్ ఎవరికి ఉంది అని ఎన్టీఆర్ అంటే ధనరాజ్‌ అని.. తనకు నచ్చని సెలబ్రిటీ ముమైత్ ఖాన్ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఇక బిగ్ బాస్ హౌస్‌ను వీడే ప్రతి సెలబ్రిటీ ఇచ్చే మాదిరిగానే ‘బిగ్ బాంబ్’ అస్త్రాన్ని ఇచ్చారు కల్పనకు.

NTR Kalpana

ఈ బిగ్ బాంబ్‌ను ప్రిన్స్ అండ్ దీక్షలపై విసిరింది కల్పన. దీంతో దీక్షకు ద్వారపాలకుడిగా వారం రోజులు సేవలు చేయబోతున్నాడు ప్రిన్స్. దీని ప్రకారం హౌస్‌లో ఉన్నవారిలో ఇద్దర్ని ఎంచుకోవాలని.. వాళ్లు కనీసం బాత్ రూంకి పోవాలన్నా ఇంకొకరి హెల్ప్ తీసుకోవాలనేది బిగ్ బాంబ్ కండిషన్. ఆమె కనీసం బాత్ రూంకి పోవాలన్నా .. డోర్ తీయడం కోసం ప్రిన్స్ సహాయం తీసుకోవాల్సిందే. మరి ఈ ద్వారపాలకుడిగా దీక్షకు ఎలాంటి సేవలు చేయనున్నాడనేది ఆసక్తిగా మారింది.

- Advertisement -