బాహుబలి మూవీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా.. ఓవర్సీస్‌లోనూ దూకుడు చూపిస్తున్నాడు. దగ్గుపాటి రానా హీరోగా తెరకెక్కిన మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి’ . ఈ సినిమా శుక్రవారం భారీ అంచనాలతో విడుదలై కలెక్షన్స్‌లో దూసుకుపోతుంది.
ఇక అదే రోజున రిలీజ్ అయిన ‘జయజానకి నాయక’, ‘లై’ మూవీల కంటే కలెక్షన్స్‌లో ముందంజలో ఉంది జోగేంద్రుడి మూవీ.
రానా పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ మూవీ ఓవర్సీస్‌లో ప్రీమియర్ షో నుండే మంచి కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజే $1,50,000 డాలర్లను రాబట్టిన ఈ మూవీ రెండో రోజూ జోరును చూపించింది. ఓవర్సీస్ ట్రేడ్ పండితులు అంచనా ప్రకారం ఈ మూవీ మూడున్నర లక్షల డాలర్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. అయితే వరుస సెలవులు రావడంతో ఈ మూవీ లాంగ్ రన్ లో ఖచ్చితంగా హాఫ్ మిలియన్ క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.
ఇక ఓవరాల్ కలెక్షన్స్ రికార్డ్స్‌ను చూస్తే.. రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీకి రెండు రోజులకు 13.6 కోట్ల గ్రాస్ వస్తే.. బోయపాటి ‘జయజానకి నాయక’ మూవీకి 10.4 కోట్ల గ్రాస్ రాగా.. నితిన్ ‘లై’ మూవీ 8.2 కోట్లతో సరిపెట్టుకుంది. రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీకి మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా జైకొట్టడంతో ఈ మూవీ రానా కెరియర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ చిత్రంగా నిలిచే అవకాశం ఉందని సినీ పండితుల అభిప్రాయం.