రష్మీ గౌతమ్.. బుల్లితెర ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. ‘జబర్దస్త్ కామెడీ షో’లో యాంకర్ గా పనిచేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్న రష్మీ వెండితెరపై కూడా తన నటనతో అలరిస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించిన రష్మీ, ఆ సినిమాలో అందాల ఆరబోతకు వెనుకాడకుండా చేసింది.
అంతే కాకుండా ‘జబర్దస్త్’ ఫేమ్ సుడిగాలి సుధీర్ తో ఎఫైర్లు ఉన్నట్లు ఎన్నోసార్లు పుకార్లు వచ్చాయి. అయితే వారిద్దరి మధ్య ఏమి లేదని ఇద్దరు బహిరంగంగానే చెప్పారు. రష్మీ పేరు అటు సోషల్ మీడియాలో ఇటు వార్తల్లో నిత్యం నిలుస్తూనే వుంది.
ఈ మధ్య జబర్దస్త్ లో తన క్రేజీ ఔట్ ఫిట్ తో కవ్వించే డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది రష్మి. ఒక పర్పుల్ ఫ్యాషన్ డ్రెస్స్ వేసుకొని వచ్చింది. ఈ డ్రెస్స్ స్పెషల్ ఏంటి అంటే పూర్తిగా వెస్ట్రన్ కాదు అలా అని పూర్తిగా దేశి స్టైల్ కూడా కాదు. ఒక పర్పుల్ షర్ట్ వేసుకొని దాని కింద లుంగీ లా అనిపించే ఒక స్కర్ట్ వేసుకొని తన చిందులతో అక్కడ చూసే వారికి మంచి కనులపండుగ చేసింది. మామూలుగా యాంకర్లు ఏదో వింత ఫ్యాషన్ డ్రెస్స్ లు వేసుకొని షో చేస్తూ ఉంటారు. కాని ఇక్కడ ఆ యాంకర్ల ఆచారానికి విరుద్దంగా ఉన్న డ్రెస్స్ వేసిన రష్మి దాన్ని తన అందం తో గొప్పగా మలుచుకుంది.