ఒలింపిక్స్ లో 8 పతకాల విజేత, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఆఖరి పరుగును మాత్రం కాంస్యంతో ముగించాడు. లండన్ వేదికగా జరుగుతున్న ఐఏఏఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో బోల్ట్ చివరిసారిగా పాల్గొని కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఈవెంట్‌లో అమెరికా స్ప్రింటర్ గాట్లిన్ విజేతగా నిలిచాడు. వివాదాస్పద కెరీర్‌తో ముందుకు సాగుతున్న గాట్లిన్ చిట్టచివరకు తన చిరకాల ప్రత్యర్థిపై ఈ విక్టరీతో పగ తీర్చుకున్నాడు. గాట్లిన్ 9.92 సెకన్లు, క్రిష్టియన్ కోలెమన్(అమెరికా) 9.94 సెకన్లు, ఉసేన్ బోల్ట్(జమైకా) 9.95 సెకన్లలో వంద మీటర్ల పరుగును పూర్తి చేశారు. ఐతే అమెరికాకు చెందిన మరో పరుగుల వీరుడు కోలెమన్ రజతం కైవసం చేసుకున్నాడు.
శనివారం అర్ధరాత్రి జరిగిన 100 మీటర్ల రేసులో 9.95 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. బోల్ట్ చివరి పరుగును చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయంగా ఎంతో మంది క్రీడాభిమానులను సంపాదించుకున్న బోల్ట్ చివరి పోరులోనూ గెలుపొంది తమను అలరిస్తాడని భావించిన ప్రేక్షకుల ఆశ నెరవేరలేదు. దశాబ్దకాలంగా స్ప్రింట్ ఈవెంట్‌ను ఏకఛత్రాధిపత్యం ఏలిన బోల్ట్.. తన కెరీర్‌లో 8సార్లు ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచాడు. పరుగు పూర్తయిన వెంటనే బోల్ట్ ఏమాత్రం నిరాశ చెందకుండా విజేతగా నిలిచిన గాట్లిన్‌కు అభినందనలు తెలిపి.. అభిమానుల వైపు వెళ్లి వారితో ముచ్చటిస్తూ.. ఫొటోలకు పోజులిస్తూ.. సెల్పీలు దిగాడు.
ICYMI – 100m FINAL FOR THE AGES! #London2017
🥇 @justingatlin – 9.92
🥈 @__coleman – 9.94
🥉 @usainbolt 9.95 pic.twitter.com/mh4HTXZUbc— Tennessee Track & Field (@Vol_Track) August 5, 2017