ధోని టీంలో రాజమౌళి.. 24న మ్యాచ్ !

255
Dhoni to share dais with SS Rajamouli
Dhoni to share dais with SS Rajamouli
- Advertisement -

దేశంలో ధోని అంటే తెలియని వారు ఎవ్వరూ లేరు. ఒంటి చేత్తో విజయాలను అందించడమే కాదు.. క్రికెట్ లో భారత టీంను విజయవంతంగా నడిపిన ధోని జీవిత గాధ ప్రస్తుతం బయోపిక్‌ గా ఎం.ఎస్‌ ధోని ది అన్‌ టోల్డ్ స్టోరీ రూపొందుతోంది. నీరజ్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్బింగ్‌ చేసుకుని సెప్టెంబర్‌ 30వ తేదీన అన్ని భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రంలో ధోనీగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్ నటిస్తుండగా, భూమిక మరో కీలక పాత్రలో నటిస్తోంది.

Dhoni to share dais with SS Rajamouli

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను కూడా బాగా ఆకర్షిస్తోంది. కాగా ఈ నెల 24న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నారు. గ్రాండ్‌ గా జరగనున్న ఈ ఆడియో వేడకకు ధోని ముఖ్య అతిథిగా పాల్గొంటున్నాడు. ఆయనతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి తన చేతుల మీదుగా ఈ ఆడియోను విడుదల చేయనుండడం విశేషం.

Dhoni to share dais with SS Rajamouli

ఎంఎస్ ధోనీ’ ఆడియో వేడుక టీంలో రాజమౌళి కూడా ఉన్నాడన్నమాట. ఇప్పుడిదే విషయాన్ని ప్రేక్షకులు సరదాగా ధోనీ టీంలో రాజమౌళి అని చెప్పుకొంటున్నారు. ఇక, ఆడియో మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం.

- Advertisement -