వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న డైరెక్టర్ సుకుమార్. నిర్మాతగా ‘కుమారి 21 ఎఫ్’తో విజయాన్ని ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సుకుమార్ తన సొంత సంస్థలో నిర్మించిన మరో ప్రేమకథా చిత్రం ‘దర్శకుడు’. ప్రేమకు, వృత్తి పట్ల ఉన్న తపనకు మధ్య నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథే ఈ చిత్రం. స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుందనేది అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన దర్శకుడు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం….
కథ:
మహేష్(అశోక్)కు చిన్నతనం నుండి సినిమా అంటే పిచ్చి. ఆ పిచ్చి ఉంటేనే దర్శకుడు అవుతావు ప్రోసీడ్ అంటూ తండ్రి ప్రోత్సాహం కూడా తోడవటంతో అదే పాషన్‌తో పెరిగిన అశోక్ ప్రతి విషయాన్ని సినిమా కోణంలోనే ఆలోచిస్తాడు. తాను ఏ పని చేసినా సినిమా కోసమే. సినిమా పట్ల తనకున్న పాషన్ ఏమిటో నిరూపించుకుని మొత్తానికి ఓ నిర్మాతను ఒప్పించి సినిమా అవకాశం దక్కించుకున్న మహేష్ అనుకోకుండా ట్రైన్ జర్నీలో పరిచయం అయిన నమ్రత(ఇషా)తో ప్రేమలో పడతాడు. తన జీవితంలో మొదటి ప్రిఫరెన్స్ సినిమా అయితే, సెకండ్ ప్రిఫరెన్స్ నమ్రత అనేంతగా ఆమెను ప్రేమిస్తాడు. కానీ అనుకోని పరిస్ధితుల్లో ప్రేమ, సినిమా రెండింటినీ కోల్పోయిన అశోక్ ఎలాంటి బాధ అనుభవించాడు, అసలతను సినిమాకెందుకు దూరమవాల్సి వచ్చింది..?చివరకు కథ ఎలా సుఖాంతం అయిందో తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో మొదటి నుండి చివరి దాకా ఆకట్టుకునేది హీరో పాత్ర చిత్రీకరణ. హీరోగా తొలి పరిచయం అయినప్పటికీ అశోక్ పెర్ఫార్మెన్స్ పరంగా మెప్పించాడు. లుక్స్ పరంగా కూడా ఫర్వాలేదు. హీరోయిన్ ఇషా అందంగా కనిపించడంతో పాటు నేచురల్‌గా నటించింది. పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.సినిమానే జీవితంగా భావిస్తూ, సినిమాలోనే జీవితాన్ని చూసే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, ఎలా ఆలోచిస్తాడు, జీవితంలో జరిగే ప్రతి సంఘటనను, చివరికి ప్రేమను, ప్రేమించిన అమ్మాయిని కూడా సినిమా కోణం నుండే చూస్తూ అన్ని ఎమోషన్స్ ని తన సినిమా కోసం ఎలా వాడుకుంటాడు అనేది బాగా చూపించారు.
మైనస్ పాయింట్స్ :
కథలో ప్రధాన మైనస్ అంటే దర్శకత్వ లోపమనే చెప్పాలి. డైరెక్టర్ హరిప్రసాద్ జక్కా పేపర్ మీద రాసుకున్నంత బలంగా తెర మీద సినిమానౌ ఆవిష్కరించలేకపోయారని అర్థమవుతోంది. సినిమా కాన్సెప్టు కొత్తగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే తేడా కొట్టింది. స్లో నేరేషన్, చాలా చోట్ల సీన్లు రిపీటైన ఫీలింగ్ రావడంతో కాస్త బోర్ అనిపిస్తుంది. సినిమాలో రెండు మూడు చోట్ల ట్విస్టులున్నా ప్రేక్షకులను అంత ఎగ్జైట్ చేయలేక పోయాయి.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. దర్శకుడు హరి ప్రసాద్ జక్కా మంచి అంశాన్నే కథగా ఎంచుకున్నప్పటికీ అనుభవ లోపం వలన బలమైన స్క్రీన్ ప్లే, హత్తుకునే సన్నివేశాలు రాసుకోలేక, నటుల చేత ఎమోషన్స్ పలికించాల్సిన చోట పలికించలేక సినిమాను పేలవంగా తీశారు. ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సాయి కార్తీక్ నైపథ్య సంగీతం బాగున్నా పాటలు మాత్రం క్యాచీగా అనిపించలేదు. ఎడిటింగ్ పర్వాలేదు. సుకుమార్ నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.
తీర్పు :
ఆకట్టుకునే లవ్ ట్రాక్, ఈషా రెబ్బ నటన, క్లైమాక్స్ సీన్ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా భావోద్వేగాల్ని పలికించే సన్నివేశాలు లేకపోవడం, కామెడీ వంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం నిరుత్సాహాపరిచే అంశాలు. మొత్తం మీద చెప్పాలంటే డైరెక్టర్లోని అనుభవ లోపం వలన దెబ్బ తిన్న ఈ సినిమా దర్శకుడు.
విడుదల తేదీ : 04/08/2017
రేటింగ్ : 3/5
నటీనటులు : అశోక్, ఈషా రెబ్బ
సంగీతం : సాయి కార్తీక్
నిర్మాత : సుకుమార్
దర్శకత్వం : హరి ప్రసాద్ జక్కా