ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో, భరత్ అవ్వారి నిర్మాతగా ధృవ శేఖర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర, పావని ,ఆర్యన్. పూర్ణి లు జంటగా మెట్టమెదటి సారిగా ఎమెషనల్ లవ్‌స్టోరి గా తెరకెక్కిన చిత్రం లవర్స్‌క్లబ్. ఈ చిత్రాన్ని ప్లాన్ ‘బి’ ఎంటర్ టైన్మెంట్స్ యరియు శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యెక్క టీజర్, స్టిల్స్ ఇప్పటికే టాక్ ఆఫ్ ద యూత్ కాగా, ఇప్పడు ట్రైలర్ ని విడుదల చేశాము. పక్కా యూత్‌ఫుల్ ఎమెషనల్ లవ్‌స్టోరిగా యువత ని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం అగష్టు 25 న విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత భరత్ అవ్వారి మాట్లాడుతూ.. 2017 లో పెద్ద చిత్రాలు ఏరేంజ్‌లో సూపర్‌హిట్స్ అయ్యాయో చిన్న చిత్రాలు అదే రేంజ్ విజయాలు సాధించాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అని ఆడియన్స్ ఫ్రూవ్ చేశారు. చిన్న చిత్రాలు మనుగడకి మార్గం వేశారు. అదే ధైర్యంతో మా లవర్స్ క్లబ్ ని విడుదల చేస్తున్నాం. మా కంటెంట్ పక్కా ఎమెషనల్ గా అందరిని ఆకట్టుకుంటుంది. కొత్త వారితో చేసినా మెచ్యురిటి గా మా దర్శకుడు ధృవ శేఖర్ అందరితో పెర్‌ఫార్మ్‌న్స్ ని రాబట్టుకున్నారు. మా చిత్రానకి సంభందించిన అన్ని ప్రచార చిత్రాలు ప్రేక్షకులు ఆదరించారు. ఈ అగష్టు లో విడుదల కానున్న మా ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాం. అని అన్నారు.
దర్శకుడు ధృవ శేఖర్ మాట్లాడుతూ.. లవర్స్ కి అండగా నిలబడే ఒక యువకుడి జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు వస్తే వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర కధాంశం. యదార్ధ సంఘటనలకు ఇన్స్పిర్ అయ్యి ఈ చిత్రాన్ని తెరకేక్కించాం. ఫస్ట్ టై ఐ ఫోన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకేక్కించాం. ఇంతవరకు ఎవరు తీయని విధంగా ఈ టెక్నాలజీతో మేము తీసాం. ఈ టెక్నిక్ ఇండస్ట్రీ వాళ్ళని, యూత్ ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. వినోదాత్మకంగా ఎమెషనల్ గా చిత్ర కథాంశాన్ని ఎంచుకున్నాం. అనుకున్నది అనుకున్నట్టుకుగా తెరకెక్కించాం. పక్కాకమర్షియల్ ఎలిమెంట్స్ వున్న చిత్రం లవర్స్ క్లబ్, యూనిట్ మెత్తం చాలా కష్టపడి ఇష్టపడి చేశాము.యూత్ ఫుల్ టీం కావటంతో అందరు చాలా ఎనర్జిగా పనిచేశారు. స్క్రీన్ మీద కూడా అదే ఎనర్జి కనపడుతుంది. మా ట్రైలర్ అందర్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము. అగష్టు లో చిత్రాన్ని విడుదల చేయనున్నాము .. అని అన్నారు.
నటినటులు:అనిష్ చంద్ర,పావని,ఆర్యన్,పూర్ణి,ధీరజ్,చిత్రం బాష,వైజాగ్ ప్రసాద్,అజయ్ రత్నం,టెక్నీషియన్స్:,మ్యూజిక్: రవి నిడమర్తి,ఆర్ట్: నాగేంద్ర,ఎడిటింగ్: కిరణ్ కుమార్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్: కమల్.డి.,డి.ఓ.పి. డి.వి.ఎస్.ఎస్. ప్రకాష్ రావు,మాటలు: ధృవ్ శేఖర్, ప్రదీప్ ఆచార్య,పాటలు: రాంబాబు గోసాల,ధృవ శేఖర్,ఎగ్జ్యూటివ్ ప్రొడ్యూసర్: మదన్ గంజికుంట, అవ్వారి ధను,అసోసీయెటెడ్: నవీన్ పుష్పాల, శ్రీ చందన గాలిపల్లి,నిర్మాత: భరత్ అవ్వారి,రచన-దర్శకత్వం: ధృవ్ శేఖర్.
https://youtu.be/C0KIPGF6Qe8