మెగాస్టార్‌కి విలన్‌గా సూపర్ స్టార్‌!

190
Superstar Sudeep in Uyyalawada!
Superstar Sudeep in Uyyalawada!
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీతో వందకోట్లు వసూల్ చేసిన చిరు తన 151వ సినిమాతో కూడా తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న లాంచ్ చేయడానికి కొణిదెల ప్రొడక్షన్స్ ఏర్పాట్లు చేసుకుంటోంది. కథానాయికలుగా ఐశ్వర్యరాయ్ .. నయనతారలను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక అమితాబ్ ను .. కన్నడ స్టార్ ఉపేంద్రను ఎంపిక చేసుకున్నారనే టాక్ వచ్చింది.

తాజాగా .. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం కన్నడ నటుడు సుదీప్ ను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలుగువాడై వుండి .. ఆంగ్లేయులకు సహకరించే పాత్ర కోసం ఆయనని అడుగుతున్నారట. తప్పకుండా ఆయన అంగీకరించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉపేంద్రను వేరే రోల్ కోసం తీసుకున్నారా? ఆయన బదులుగా సుదీప్ ను తీసుకోనున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. ఈ సినిమాకు సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -