పెళ్లైన నిర్మాతతో అనుష్క పెళ్లి..

268
Anushka
- Advertisement -

ఏజ్ తో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం.. హాలీవుడ్, బాలీవుడ్ లో కామన్. ఇప్పుడు ఈ ధోరణి దక్షిణాదిలోనూ మొదలవనుందా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్ అనుష్కపై ఇలాంటి వార్త ఒకటి ఫిల్మ్ సర్కిళ్లో హల్ చల్ చేస్తోంది.’ప్రస్తుతం ఈ భామ ఓ తెలుగు సినీ ఆగ్ర నిర్మాతను పెళ్లి చేసుకోనుందని సమాచారం.ఆ ప్రొడ్యూసర్ తో కొద్దిరోజులుగా అనుష్క ప్రేమాయణం నడుపుతుందట.ఆ నిర్మాత ఎవరన్నది తెలియదు కాని, త్వరలో ఆ ప్రొడ్యూసర్ తో పెళ్లి పీటలెక్కడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.

Anushka Shetty Hot Images in Rudramadevi

ఇప్పటికే ఆ నిర్మాత అనుష్కను పెట్టి ఓ సినిమా కూడా నిర్మించాడట. అప్పటి నుంచి అనుష్క ఆ ఏజ్ బార్ నిర్మాతతో చాలా క్లోజ్ గా ఉంటుందట. ఇది చూసిన చాలామంది వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుందని చెబుతున్నారు.ఆ నిర్మాతకు ఇప్పటికే పెళ్లి కూడా అయిందని సమాచారం.

అనుష్కపై గతంలోనూ ఇలాంటి గాసిప్స్ వినిపించాయి. తాజా వార్త మాత్రం నూటికి నూరుపాళ్లు నిజమే అంటున్నారు తెలిసినవాళ్లంతా.పెళ్లైన తరువాత అనుష్క సినిమాలు చెయ్యదని కూడా సమాచారం. ఏజ్ బార్ అయ్యి, పైగా పెళ్లైన నిర్మాతపై అనుష్క ఎందుకు ఆసక్తి చూపిస్తుందో తెలియడంలేదు. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

- Advertisement -