సాయి ధరమ్ తేజ్ ఈ హీరో మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా.. నటనలో డ్యాన్స్‌లో తన కంటు గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే మెగా స్టార్ ఫ్యామిలి నుండి వస్తున్నాడు అంటే ఆ హీరో కచ్చితంగా డ్యాన్స్ పై పట్టు ఉండితీరాలి. ఆ నమ్మకాన్ని ఏ మాత్రం తక్కువ చేయకుండా మెగా మేనల్లుడు తన డ్యాన్స్ తో మెగా అభిమానుల అభిమానాన్ని పొందాడు. ఇప్పుడు తన సినిమాలు హిట్ ట్రాక్ లో లేకపోయినా రాబోతున్న ‘జవాన్’ ‘నక్షత్రం’ సినిమాలతో మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాడు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమా జవాన్ లో ఒక పాట కోసం అద్భుతమైన డాన్స్ చేశాడు అని తెలుస్తోంది.
అది కూడా ఆ పాటలో నాన్ స్టాప్ గా ఒక నిముషం పాటు డ్యాన్స్ చేశాడట. అదీ కూడా సింగల్ టేక్ లో పర్ఫెక్ట్ గా చేసి సెట్లో ఉన్న అందరిని వావ్ సూపర్బ్ అనేలా చేశాడని చెబుతున్నారు. చిరంజీవిని మెగాస్టార్ గా నిలబెట్టిన అంశాలలో ఆయన డాన్స్ ఒకటి. ఆయన తరువాత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన చరణ్ .. అల్లు అర్జున్ ఇద్దరూ కూడా, డాన్సుల్లో శభాష్ అనిపించుకున్నారు. ఆ తరువాత ప్లేస్ సాయిధరమ్ తేజ్ దే అనేది అభిమానుల మాట. అందువలన డాన్సుల్లో మరింత కష్టపడటానికి తేజు ప్రయత్నిస్తున్నాడు. ‘జవాన్’ సినిమాకు బీవీఎస్ రవి దర్శకుడిగా వ్యవహరిస్తోన్నాడు. ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ కథానాయిక.