డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వ్యవహారంలో ఆర్జేడీ, జేడీయూ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు తాను సాక్షిగా నిలవలేనని గవర్నర్‌తో చెప్పినట్లు సమాచారం. అంతకుముందు గంటన్నరపాటు న్యాయనిపుణులతోనితీశ్ చర్చించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని, తగిన ఏర్పాట్లు చేసే వరకు రాజ్యాంగబద్దంగా ఈ పదవిలో కొనసాగుతానని నితిష్ కుమార్ అన్నారు.
తేజస్వీ రాజీనామా చేసేది లేదని లాలూ ప్రసాద్ స్పష్టంచేశారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజా పరిణామాలపై ఇవాళ వేర్వేరుగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో లాలూ, నితీశ్ సమావేశమయ్యారు.
తేజస్వీయాదవ్ రాజీనామా చేసేది లేదని సమావేశంఅనంతరం లాలూప్రసాద్ యాదవ్ స్పష్టంచేశారు. మరోసారి ఈ అంశంపై చర్చించొద్దని నితీశ్‌కు సూచించారు. స్పందించిన‘తేజస్విపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని మాత్రమే నితీశ్ అడిగారు తప్పా, రాజీనామా చేయాలని కోరలేదు. తేజస్విపై తప్పుడు ఆరోపణలు చేశారని నితీశ్ కు చెప్పాం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో నితీశ్ కలిశారు. ఎందుకంటే, నితీశ్ రాజీనామా చేయగానే ప్రధాని మోదీ ట్వీట్ చేసి అభినందించడమే ఇందుకు నిదర్శనం. బీహార్ శాసనసభలో పెద్దపార్టీ మాదే. మా పార్టీ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారు’ అని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.