Kiran Abbavaram: ‘రికార్డ్’ ఫస్ట్‌లుక్

1
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ‘రియాలిటీ’ సినిమాతో బిజీగా ఉన్న ఆయన.. తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. తన కెరీర్‌లో 14వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకు ‘రికార్డ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. సినిమా ప్రకటనతో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అందులో స్మార్ట్‌ఫోన్‌ను చూపించి సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో రక్తవర్ణంలో కనిపిస్తున్న పౌర్ణమి చంద్రుడి నేపథ్యంలో ఓ గుర్రం పరుగులు తీస్తున్నట్లు చూపించారు. ఈ పోస్టర్ సినిమా కథాంశంపై ఆసక్తిని పెంచుతోంది. అయితే సినిమా కథకు సంబంధించిన వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు.

ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా నేడు ఘనంగా నిర్వహించారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, థీ స్టోరీస్ బ్యానర్లపై వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీర కొగటం దర్శకత్వం వహిస్తున్నారు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా.. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించనున్నారు.

Also Read:బీఆర్ఎస్ నేతల అరెస్టులు ఎందుకు?

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. విభిన్నమైన టైటిల్, ఆసక్తికరమైన ఫస్ట్ లుక్‌తో ‘రికార్డ్’ సినిమాపై చిత్రబృందం అంచనాలు పెంచుతోంది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో ఎలాంటి కథను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

- Advertisement -