బజార్ లో దొరికిపోయిన ఆప్టే..

258
- Advertisement -

హీరోయిన్ రాధికా ఆప్టేకి ఛాన్సొస్తే చాలు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ గా మారిపోతుంది. అటు గ్లామర్‌లోనూ..ఇటు నటనలోనూ తనదైన ట్యాలెంట్‌ని బయటపెట్టేస్తుంది ఆప్టే.

అంతేనా..? ఇతర హీరోయిన్లు చెయ్యలేని క్యారెక్టర్లను ఎలాంటి మొహమాటం లేకుండా చెయ్యగలదు ఈ అమ్మడు. ఇదిలా ఉంచితే.. ఆమె వ్యక్తిగత సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అప్పట్లో హాట్ టాపిక్‌కు తెరలేపింది ఈ హాట్‌ బ్యూటీ. అంతేకాకుండా ఓ సినిమాలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది.

 Radhika Apte Gets Into Fight With Photographers In Mumbai Shooting ...

ఇక అసలు విషయానికొస్తే..ఈ సెక్సీ బ్యూటీ ఫొటోగ్రాఫర్లపై ఫైర్‌ అయింది. రాధికా ఆప్టే ప్రస్తుతం ‘బజార్’ అనే బాలీవుడ్ సినిమా షూటింగులో పాల్గొంటోంది. ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో కొంతమంది ఫోటోగ్రాఫర్ల కెమెరాలకు దొరికిపోయింది రాధిక ఆప్టే. షూటింగ్‌ అనంతరం లంచ్ కోసం ఆమె తన వ్యానిటీ వ్యాన్ లోకి వెళ్లింది.

కొంతసేపటి తరువాత బయటికొచ్చింది ఈ అమ్మడు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫోటోగ్రాఫర్లు ఆమె పర్సనల్ మూమెంట్స్ పై కెమెరాలను క్లిక్ మనిపించారు. తన అనుమతి తీసుకోకుండా ఫోటోలను తీయడం పట్ల ఆమె అభ్యంతరాన్ని .. ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

ఆ ఫోటోలను డిలీట్ చేయమంటూ డిమాండ్ చేసింది. ఈ సినిమాకి సంబంధించి రాధికా ఆప్టే లుక్ ఇప్పట్లో బయటికి రాకుండా చూడాలని దర్శక నిర్మాతలు బలంగా అనుకున్నారట. అందుకే మీడియా ఫొటోగ్రాఫర్లపై రాధిక ఆప్లే ఫైర్‌ అయిందని అంటున్నారు.

- Advertisement -