తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. ఈ నెల 23న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్‌తో సమావేశం కావాలని హైకమాండ్ ఆదేశించింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ స్వయంగా ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డికి సమాచారం అందించారు.
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బీఎం సందీప్‌ను పార్టీ అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నడిపించడంతో పాటు నాయకుల మధ్య సమన్వయం పెంచే దిశగా అధిష్ఠానం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమైన నాయకులతో కొత్త ఇన్‌ఛార్జి వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డిని నవంబర్ 23న సమావేశానికి హాజరుకావాలని సూచించారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఫోన్ ద్వారా ఈ ఆహ్వానాన్ని అందించారు. కొత్త ఇన్‌ఛార్జితో జరిగే ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. హైకమాండ్ పిలుపు మేరకు ఆయన కొత్త ఇన్‌ఛార్జితో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు? సమావేశం అనంతరం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read:దేశంలో పెరిగిన మత్య్స సంపద

