NBK:బాలకృష్ణకు విశిష్ట పురస్కారం

1
Balakrishna
- Advertisement -

తెలుగు సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కనుంది. ఆయనను విశిష్ట పురస్కారంతో సత్కరించాలని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నిర్ణయించింది. కళారంగం విభాగం నుంచి ఈ పురస్కారానికి బాలకృష్ణ పేరును ప్రతిపాదించారు.

సినీ రంగంలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించడంతో పాటు తెలుగు భాష, సంస్కృతిపై అభిమానాన్ని చాటుకుంటున్న బాలకృష్ణ సేవలను తెలుగు విశ్వవిద్యాలయం గుర్తించింది. అంతేకాకుండా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టు బోర్డు చైర్మన్‌గా ఆయన అందిస్తున్న సేవలను కూడా పరిగణనలోకి తీసుకుంది. క్యాన్సర్ బాధితులకు వైద్య సేవలు అందించడంలో ఆసుపత్రి ద్వారా ఆయన చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారానికి పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

తెలుగు విశ్వవిద్యాలయం చేసిన ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపినట్లు సమాచారం. సినిమా రంగంతో పాటు సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేసిన బాలకృష్ణకు ఈ పురస్కారం దక్కనుండటం ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. అయితే పురస్కార ప్రదానోత్సవానికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Also Read:EPFO New Rules:ఈపీఎఫ్‌ విత్‌డ్రా..కొత్త రూల్స్

- Advertisement -