Modi:డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యం

1
PM Modi
- Advertisement -

డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం కోసం సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యం పెరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చేపట్టే కార్యక్రమాలు సాధారణ, నామమాత్రపు చర్యలకే పరిమితం కాకూడదని అన్నారు. ఈ ప్రయత్నాల్లో సామాజిక సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, విద్యాసంస్థలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు.

సామాజిక న్యాయం, సాధికారత శాఖ నిర్వహించిన విభాగాల స్థాయి సదస్సు ముగింపు సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ రహిత భారత్ (నషా ముక్త్ భారత్) నిర్మాణం కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అలాగే దివ్యాంగులను ముందుగానే గుర్తించడం, వారిపై సమాజంలో ఉన్న వివక్ష, అపోహలను తొలగించడం కోసం ప్రజల భాగస్వామ్యం (జన్ భాగీదారీ) పెరగాలని అన్నారు. దివ్యాంగులకు అందుబాటు ధరల్లో సహాయక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు స్టార్టప్‌లను ప్రోత్సహించాలని సూచించారు.

Also Read:EPFO New Rules:ఈపీఎఫ్‌ విత్‌డ్రా..కొత్త రూల్స్

ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. సామాజిక సంక్షేమ పథకాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, అందుబాటు ధరల్లో సహాయక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి స్టార్టప్‌లను ప్రోత్సహించడం, డ్రగ్స్ రహిత భారత్ కోసం సమాజమంతా కలిసికట్టుగా పనిచేయడం వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు వెల్లడించారు.

- Advertisement -