తీవ్ర తుఫాన్ అకవన్ ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం కావడంతో భువనేశ్వర్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో తీరం దాటే ప్రక్రియ మొదలైందని మరో మూడు గంటల పాటు కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
తుఫాన్ పరిస్థితిపై విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ పీఎల్ఎన్ మూర్తి కీలక వివరాలు వెల్లడించారు. తీవ్ర తుఫాన్ నిన్న రాత్రి నుంచే క్రమంగా బలహీనపడటం ప్రారంభించిందని తెలిపారు. గత ఆరు గంటల్లో గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదిలిందని చెప్పారు. గోపాల్‌పూర్ సమీపంలో తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, తుఫాన్ కేంద్ర భాగం తీరాన్ని దాటిందని వెల్లడించారు. ఈ ప్రక్రియ మరో రెండు గంటల పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించారు. తుఫాన్ ప్రభావంతో గోపాల్‌పూర్ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
తుఫాన్ బలహీనపడుతున్నప్పటికీ భారీ వర్షాలు, ఈదురుగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Also Read:EPFO New Rules:ఈపీఎఫ్ విత్‌డ్రా..కొత్త రూల్స్

