ధనుష్‌ పొలిటికల్ ఎంట్రీపై సాయి పల్లవి!

1
- Advertisement -

తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి వస్తారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ సాయిపల్లవి ఆయనకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి వెళ్లినా సినిమాలకు మాత్రం దూరం కావొద్దని కోరారు.

ధనుష్, సాయిపల్లవి కలిసి నటించిన ‘మారి 2’ సినిమా 2018లో విడుదలైంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓఎం: చాప్టర్ వన్ – ఉధిరం: ది బ్లడ్ వుడ్’ సినిమాలో వీరు నటిస్తున్నారు. ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కు వస్తున్న సమయంలో తనకు దారిపొడవునా అనేక జెండాలు కనిపించాయని సాయిపల్లవి తెలిపారు. వాటిని చూసినప్పుడు సినిమా వేడుకకు కాకుండా రాజకీయ సభకు వెళ్తున్నట్లుగా అనిపించిందని సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం ధనుష్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలను ప్రస్తావించారు.

ధనుష్ జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా తాను మద్దతు ఇస్తానని, ఆయనకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే విజయ్ రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ధనుష్ కూడా నటనకు స్వస్తి చెప్పకూడదని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నటనను వదిలేయడం తనలాంటి నటులకు బాధ కలిగించిందని సాయిపల్లవి అభిప్రాయపడ్డారు. ధనుష్ కూడా రాజకీయాల్లోకి వెళ్లినా సినిమాల్లో కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ధనుష్ ఏ మార్గాన్ని ఎంచుకున్నా తనకు అభ్యంతరం లేదని కానీ సినిమాల్లో మాత్రం నటించడం కొనసాగించాలని కోరారు. ఆయనలాంటి గొప్ప నటుడిని ప్రేక్షకులు కోల్పోవడం ఇష్టం లేదని, ఇదే తన ప్రత్యేక విజ్ఞప్తి అని సాయిపల్లవి పేర్కొన్నారు.

Also Read:రెండోసారి ICC చైర్మన్‌గా జై షా

- Advertisement -