మన శరీరంలో కాలేయం (లివర్) ఎంతో కీలకమైన అవయవం. రక్తంలోని హానికరమైన పదార్థాలను తొలగించడం నుంచి ఆహారం జీర్ణం కావడానికి సహాయపడటం వరకు ఎన్నో ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే ఇందుకోసం ప్రత్యేకమైన ఆహారం తీసుకోవడం లేదా ఒక్క ఆహార పదార్థాన్ని ఎక్కువగా తినడం మాత్రమే సరిపోదు. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం, పాటించే జీవనశైలి అలవాట్లు కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
కొన్ని ఆహార పదార్థాలు కాలేయాన్ని శుభ్రం చేస్తాయని, దెబ్బతిన్న కాలేయాన్ని తిరిగి బాగు చేస్తాయని చాలామంది నమ్ముతుంటారు. అయితే ఇలాంటి ప్రచారాలన్నీ నిజం కావు. కాలేయాన్ని శుభ్రం చేస్తాయని ప్రచారం చేసే డిటాక్స్ టీలు, క్లెన్సింగ్ డ్రింక్స్‌కు 10కి మైనస్ 10 రేటింగ్ ఇచ్చారు. దీనికి కారణం మీ కాలేయానికి ప్రత్యేకంగా డిటాక్స్ అవసరం లేదు. మీ కాలేయమే సహజమైన డిటాక్స్ వ్యవస్థ.
ఇక బ్లాక్ కాఫీకి 10కి 10 రేటింగ్ ఇచ్చారు. క్రమం తప్పకుండా కాఫీ తాగడం వల్ల కాలేయంలో ఫైబ్రోసిస్ (కణజాలం గట్టిపడటం), మచ్చలు ఏర్పడే ప్రమాదం తగ్గుతుందని కాలేయ క్యాన్సర్ ముప్పు కూడా తగ్గే అవకాశం ఉందని వివరించారు. అలాగే వెయిట్ లిఫ్టింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలను కూడా సిఫార్సు చేశారు. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంతో పాటు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించేందుకు సహాయపడతాయయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి కండరాల బలం పెంచుకోవడం ఎంతో ముఖ్యం.
శరీర బరువులో ప్రతి కిలోకు రోజుకు సుమారు 1.2 నుంచి 1.6 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. ఫైబర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటంతో పాటు కడుపు నిండిన భావన కలుగుతుందని పేగుల్లోని మంచి బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.
Also Read:విశాఖ వేదికగా ‘CII సదస్సు’-2026
() టాయిలెట్లో ఫోన్ ఎక్కువసేపు చూడటం: టాయిలెట్లో కూర్చుని ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించడం వల్ల మలద్వారంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పైల్స్ వచ్చే ప్రమాదం పెరగవచ్చని హెచ్చరించారు.
()మల విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి చేయడం: మల విసర్జన కోసం గట్టిగా ఒత్తిడి పెట్టడం వల్ల పైల్స్ సమస్య తీవ్రమవడంతో పాటు కటి ప్రాంతంలోని కండరాలపై ప్రభావం పడవచ్చు.
()బీన్స్, పప్పుధాన్యాలను తినకపోవడం: బీన్స్‌లో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడటంతో పాటు మల విసర్జన సక్రమంగా జరిగేలా చేస్తాయి. బీన్స్, ఇతర పప్పుధాన్యాలు తీసుకోవడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ ముప్పు తగ్గే అవకాశం కూడా ఉందని తెలిపారు.
() ప్రతిరోజూ మల విసర్జన అవుతుందని నిర్లక్ష్యం చేయడం: రోజూ మల విసర్జన అవుతున్నంత మాత్రాన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉందని భావించకూడదు. మలం గట్టిగా ఉండటం, విసర్జన సమయంలో ఇబ్బంది కలగడం, కడుపు పూర్తిగా ఖాళీ కాలేదనే భావన ఉండటం వంటివి మలబద్ధకం లక్షణాలు కావచ్చని వివరించారు.

