మిస్సిసిపీలో తొలి నల్లజాతి సెనేటర్‌!

2
- Advertisement -

అమెరికా రాజకీయాల్లో అరుదైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. మిస్సిసిపీ రాష్ట్రం నుంచి 152 ఏళ్ల తర్వాత తొలిసారిగా నల్లజాతికి చెందిన వ్యక్తి అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి స్కాట్ కొలోమ్ (43) రిపబ్లికన్ పార్టీ సిట్టింగ్ సెనేటర్ సిండీ హైడ్-స్మిత్‌పై విజయం సాధించారు. దీంతో 1874 తర్వాత మిస్సిసిపీ నుంచి సెనేట్‌కు ఎన్నికైన తొలి నల్లజాతి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తొలుత కొద్ది ఓట్ల ఆధిక్యంతో కొనసాగిన ఆయన.. చివరకు 4,500కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం ఓట్లలో సుమారు 0.5 శాతం ఆధిక్యం సాధించారు. ఈ విజయంతో 1982 తర్వాత మిస్సిసిపీ నుంచి సెనేట్‌కు ఎన్నికైన తొలి డెమొక్రటిక్ అభ్యర్థిగా కూడా ఆయన నిలిచారు.

కొలోమ్ తన ఎన్నికల ప్రచారంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న జీవన వ్యయాల పెరుగుదలను ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యంగా మాంసం, ఇంధన ధరల పెరుగుదలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ప్రత్యర్థి సిండీ హైడ్-స్మిత్ గతంలో మాంసం ధరలు పెరిగితే ఇతర ప్రోటీన్ ఆహార పదార్థాలను ఎంచుకోవచ్చంటూ చేసిన వ్యాఖ్యలను కొలోమ్ తన ప్రచారంలో ప్రస్తావించారు.

Also Read:KTR:వట్టిపోయిన శ్రీరాంసాగర్‌కు జీవం పోసింది కేసీఆరే!

కొలోమ్ విజయంతో 100 మంది సభ్యులున్న సెనేట్‌లో డెమొక్రాట్ల బలం 55కు చేరగా, రిపబ్లికన్ల సంఖ్య 44గా ఉంది.

- Advertisement -