అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో కారు ప్రమాదం కలకలం రేపింది. వాషింగ్టన్‌లోని లాఫాయెట్ స్క్వేర్ వద్ద ఓ కారు సైన్‌బోర్డును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వైట్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక లాక్‌డౌన్ విధించారు. ముందుజాగ్రత్త చర్యగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో సీక్రెట్ సర్వీస్, నేషనల్ గార్డ్ సిబ్బందితో ఘర్షణ జరిగినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు భద్రతా బలగాలు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో వైట్‌హౌస్ పరిసరాల్లో ఉన్న జర్నలిస్టులను ముందుజాగ్రత్తగా భవనాల లోపలికి తరలించారు.
ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నట్లు సమాచారం. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించినట్లు సమాచారం లేదు.
Also Read:అనీష్‌కి సినిమా అంటే ప్రాణం!
కారు సైన్‌బోర్డును ఢీకొట్టడానికి గల కారణాలు, డ్రైవర్ ఉద్దేశం ఏమిటనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. అధికారుల నుంచి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

