లక్ష్మణ్‌ గౌడ్‌ మృతి బాధాకరం:హరీశ్‌

3
- Advertisement -

ఉద్యమకారుడు లక్ష్మణ్‌ గౌడ్‌ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. జనగామ జిల్లా  కొన్నె గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి పరామర్శించారు హరీశ్‌.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్..లక్ష్మణ్‌ గౌడ్ మృతి మా అందరిని కూడా ఎంతగానో కలచి వేసింది…బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశంతో నేను, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి… లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబాన్ని ఓదార్చి, అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి వారికి పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించాం అని తెలిపారు.

Also Read:అనీష్‌కి సినిమా అంటే ప్రాణం!

లక్ష్మణ్‌ గౌడ్ సతీమణికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి రాజేశ్వర్‌ రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు అని తెలిపారు.

- Advertisement -