ఏపీ హైకోర్టుకు వైసీపీ ఎమ్మెల్సీలు

2
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతలకు సంబంధించిన ధర్నా కేసుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారంటూ తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లా ఈ మేరకు పిటిషన్లు దాఖలు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి నిరసన కార్యక్రమం చేపట్టారనే ఆరోపణలతో వీరిపై కేసులు నమోదయ్యాయి. విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని ఎమ్మెల్సీలు తమ పిటిషన్లలో హైకోర్టును కోరారు. ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట ధర్నా చేసిన ఘటనకు సంబంధించి నమోదైన కేసులపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన కేసు కూడా నేడు హైకోర్టు విచారణకు రానుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి నిరసన తెలిపారనే ఆరోపణలతో జగన్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఒకే ఘటనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీలు, జగన్ దాఖలు చేసిన పిటిషన్లు నేడు విచారణకు రానుండటంతో ఏపీ రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ పిటిషన్లపై హైకోర్టు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Also Read:అనీష్‌కి సినిమా అంటే ప్రాణం!

- Advertisement -