ఎంపీ చామల Vs మహేష్ గౌడ్..కొత్త పంచాయతీ!

2
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మీడియా ప్రతినిధుల నియామకాల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. టీవీ డిబేట్లలో పార్టీ తరఫున పాల్గొనే మీడియా ప్యానలిస్టులు, కోఆర్డినేటర్లు, అధికార ప్రతినిధుల జాబితాపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ మీడియా అండ్ పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన నియామకాల జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ టీవీ ఛానళ్లలో జరిగే చర్చల్లో పాల్గొనేందుకు మీడియా ప్యానలిస్టులు, మీడియా కోఆర్డినేటర్లు, సీనియర్ అధికార ప్రతినిధులు, అధికార ప్రతినిధులను ఎంపిక చేస్తూ చామల కిరణ్ కుమార్ రెడ్డి జాబితాను సిద్ధం చేశారు. ఈ మేరకు నియామకాల వివరాలను విడుదల చేశారు.

అయితే ఈ జాబితాపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చామల ప్రకటించిన నియామకాల జాబితాను ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీలో మీడియా ప్రతినిధుల ఎంపిక వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

పార్టీ తరఫున టీవీ డిబేట్లలో ఎవరు పాల్గొనాలి? మీడియా సమన్వయ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి? అనే అంశాలపై నాయకత్వం మధ్య సమన్వయం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జాబితాను నిలిపివేయడానికి గల కారణాలపై అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read:అనీష్‌కి సినిమా అంటే ప్రాణం!

- Advertisement -