కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలని పెంచంది. ఎస్ తమన్ అందించిన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అఖిల్ అక్కినేని ముఖ్య అతిథులు పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
మ్యూజికల్ కాన్సర్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్ కి, మా అభిమానులందరికీ థాంక్యూ సో మచ్. అనీష్ హీరోగా లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. తన తల్లిదండ్రులు చాలా అద్భుతమైన వ్యక్తులు. అనీష్‌కు సపోర్ట్ చేసిన వాళ్ల పేరెంట్స్‌కి థాంక్స్ చెప్తున్నాను. తనకు మరో పెద్ద సపోర్ట్ కింగ్ నాగార్జున గారు. నాగార్జున గారి లాంటి సపోర్ట్ ఉంటే తప్పు జరగడానికి అవకాశం లేదు. నాగార్జున గారు ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తూ, ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు అనీష్‌ను కూడా ఎంకరేజ్ చేయడం ఆనందంగా వుంది. అలాగే ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్న వెంకీకి, డైరెక్టర్ మహేష్‌కి ఆల్ ది బెస్ట్. అనస్వర చాలా అద్భుతమైన నటి. ‘కాకా’ సినిమాలో కూడా తను చాలా ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ‘ఇట్లు అర్జున’తో తనకు ఒక బ్లాక్‌బస్టర్ వస్తుంది. అలాగే సంక్రాంతికి ‘కాకా’తో మరో బ్లాక్‌బస్టర్ వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. తమన్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ గారి ‘ఓజీ’ సినిమాకైనా, అనిష్ ‘ఇట్లు అర్జున’కైనా సమానంగా మ్యూజిక్ చేస్తారు, తన మ్యూజిక్‌తో లక్షల మందిని కనెక్ట్ చేస్తాడు. అది పెద్ద హీరోనా, చిన్న హీరోనా అనేది చూడడు. అందరికీ ఒకేలా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు. ఇందులో పాటలన్నీ చాలా బాగున్నాయి. అనీష్‌కి సినిమా అంటే చాలా ఫ్యాషన్. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు నాకు చూపించాడు. నేను నా ఫస్ట్ సినిమాకు ఎలా చేశానో తెలియదు కానీ, నాకంటే పది రెట్లు బెటర్‌గా చేశాడు. తన ప్రతి సీన్‌ను చాలా అద్భుతంగా చేశాడు. తనకు కచ్చితంగా చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుంది. మూగవాడిగా నటించినప్పటికీ అన్ని నవరసాలను పలికించాడు. ప్యూర్ యాక్టింగ్ ఉంటే తప్ప అంత అద్భుతంగా చేయలేం. నేను కూడా ‘రంగస్థలం’ సినిమాలో చెవిటివాడిగా నటించాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే పెద్ద విజయం ఈ సినిమాతో అనీష్‌కు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తన కెరీర్లో పెద్ద అడుగు కావాలి. తన భవిష్యత్తు విజయాలకు ఇది మంచి పునాది కావాలి. అనీష్ తన తల్లిదండ్రులను, ప్రేక్షకులను గర్వపడేలా చేస్తాడని ఆశిస్తున్నాను.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. కొత్తదనాన్ని ఎప్పుడూ ఆహ్వానించే తెలుగు సినిమా ప్రేక్షకులకు థాంక్యూ. ఈ వేడుకకు వచ్చిన రామ్ చరణ్‌కి థాంక్యూ. తను చాలా హంబుల్ పర్శన్. మా పెద్దబ్బాయి తారక్ ఇక్కడికి రాలేకపోయాడు. తనుఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశాడు. థాంక్యూ తారక్. అనీష్ గ్లింప్స్ తీసుకొచ్చి వాయిస్ ఓవర్ చేయమని అడిగాడు. తన సినిమాలో మూగవాడిగా నటిస్తున్నాడు. తొలి సినిమాకే ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడం అవసరమా అని అడిగాను. రామ్ చరణ్ ఒక చెవిటి పాత్ర చేయడానికి పదేళ్లు పట్టింది. అఖిల్ ఆరో సినిమాకు బ్లైండ్ క్యారెక్టర్ చేశాడు. అయితే ‘ఇట్లు అర్జున’ కథ మీద అనీష్‌కు చాలా నమ్మకం ఉంది. నాకు సినిమా చూపించారు. సినిమా చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. అనీష్ అద్భుతంగా తన పాత్రలో లీనమైపోయాడు. సినిమా చాలా బాగుంది. తన కళ్లతో మాట్లాడాడు. తన సైలెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. అనీష్, అనస్వర కెమిస్ట్రీ సినిమాలో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అలాగే తమన్ ఇచ్చిన ప్రతి పాట హిట్ అయింది. నవంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనీష్ ప్రేమ మీ అందరికీ వినిపిస్తుంది. ఈ సినిమాను ప్రెజెంట్ చేయడం చాలా గర్వంగా ఉంది. సినిమా విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యూ సో మచ్.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ: ఈ వేడుక చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఎన్టీఆర్ గారు ఈ సినిమాను ప్రశంసించారు. తెలుగు సినిమాలో చాలాకాలం గుర్తుండిపోయే సినిమా అవుతుందని ఆయన చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయన మాటలు విన్నాక ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. అనిష్ చాలా అద్భుతంగా చేశాడు. సినిమాకు చాలా మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చిందని విన్నాను. 13న మా సినిమా కూడా వస్తోంది. దానికంటే ఇంకా బెటర్ గా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
Also Read:విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు.. ఎవరెవరంటే?

