సినీ పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో.. కొన్ని వైవాహిక బంధాలు అంతే త్వరగా ముగుస్తుంటాయి. అన్యోన్యంగా కనిపించే జంటలు కూడా వివిధ కారణాలతో విడిపోతుంటారు. ఈ నేపథ్యంలో విడాకులు తీసుకున్న ప్రముఖు సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం.
()సింగర్, నటుడు నోయల్ సీన్, నటి ఎస్తేర్ నొరోన్హా 2019లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. పరస్పర అవగాహన సమస్యల కారణంగా 2020లో విడాకులు తీసుకున్నారు. తమ విడిపోవడం గురించి ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కేవలం ఏడాది కాలంలోనే వీరి వివాహ బంధం ముగిసింది.
()అక్కినేని నాగార్జున మేనల్లుడు, నటుడు సుమంత్ 2004లో నటి కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నారు. అయితే రెండేళ్లకే అంటే 2006లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం కీర్తి రెడ్డి అమెరికాకు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. సుమంత్ మాత్రం మరో వివాహం చేసుకోలేదు.
() పవన్ కళ్యాణ్ 1997లో విశాఖపట్నానికి చెందిన నందినిని వివాహం చేసుకున్నారు. 1999లో ఇద్దరూ విడిపోయినప్పటికీ 2008లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి రేణు దేశాయ్‌ను 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2011లో విడిపోయిన ఈ జంట 2012లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
అనంతరం 2013లో రష్యాకు చెందిన అన్నా లెజ్నెవాను పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారు. వీరికి పోలెనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అన్నాతో కూడా విడిపోతున్నట్లు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది.
()తెలుగు సినిమాల్లోనూ నటించిన అమలా పాల్, దర్శకుడు ఏఎల్ విజయ్ 2014లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొద్దికాలానికే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. 2016లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా, 2017లో కోర్టు విడాకులు మంజూరు చేసింది. మూడేళ్లలోనే వీరి వైవాహిక బంధానికి ముగింపు పలికారు.
()’7/G బృందావన్ కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు సెల్వరాఘవన్, నటి సోనియా అగర్వాల్ 2006లో వివాహం చేసుకున్నారు. అయితే రెండేళ్ల తర్వాతే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2009లో చెన్నై ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల ప్రక్రియ ప్రారంభమైంది. 2010 నాటికి వీరి బంధం ముగిసింది.
()నటుడు మంచు మనోజ్ తన స్నేహితురాలు ప్రణతి రెడ్డిని 2015లో వివాహం చేసుకున్నారు. అయితే నాలుగేళ్ల తర్వాత 2019లో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విడిపోవడానికి గల కారణాలను వెల్లడించలేదు.
()నటుడు సిద్ధార్థ్ 2003లో తన పొరుగింటికి చెందిన మేఘనను వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. నాలుగేళ్ల తర్వాత 2007 జనవరిలో విడాకులు తీసుకున్నారు.
()దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మీని 1984లో పెళ్లి చేసుకున్నాడు హీరో నాగార్జున. నాగచైతన్య పుట్టాక వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1992లో నటి అమలను పెళ్లి చేసుకున్నాడు.
()సీనియర్ నటుడు శరత్ బాబు 1981లో తోటి నటి, కమెడియన్ రమాప్రభను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి స్నేహా నంబియార్‌ను 1990లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం స్నేహకు సైతం శరత్ బాబు విడాకులిచ్చారు.
()1978లో ప్రముఖ నాట్య కళాకారిణి వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు కమల్. ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చారు. 1988లో సారికను రెండో వివాహం చేసుకున్నారు. శృతిహాసన్, అక్షర హాసన్ లు వారికి పుట్టిన సంతానమే. 2004లో కమల్, సారికలు విడిపోయారు. ఆ తర్వాత నటి గౌతమితో 13 ఏళ్లుసహజీవనం చేశారు కమల్.
()ప్రముఖ సినీనటి రాధిక 1985లో ప్రతాప్ పోతన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోతనకు విడాకులిచ్చారు రాధిక. రెండో సారి లండన్‌కు చెందిన రిచర్డ్ హ్యార్లీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2001లో హీరో శరత్ కుమార్‌తో ప్రేమలో పడి మరో పెళ్లి చేసుకున్నారు.
Also Read:వందేభారత్ స్లీపర్ రైళ్లలో ‘తత్కాల్’ ఉండవు!
()బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మొదటి పెళ్లి 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్ తో జరిగింది. వీరికి ఇద్దరు సంతానము. 2004 లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ని వివాహమాడాడు సైఫ్.
ప్రముఖ గాయని సునీతకు తొలిగా కిరణ్ తో వివాహమైంది. వారికి కూతురు శ్రేయ, ఆకాష్ అనే పిల్లున్నారు. భర్తకు విడాకులిచ్చిన సునీత 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో తాళి కట్టించుకున్నారు
()1994లో వివాహం చేసుకున్న ప్రకాశ్ రాజ్, లలితా కుమారి మనస్పర్థల కారణంగా 2009 నవంబర్‌లో చెన్నై ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు పొందారు. ఆ తర్వాత 2010లో ఆయన కొరియోగ్రాఫర్ పోనీ వర్మను వివాహం చేసుకున్నారు.
()కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా తన మొదటి భార్య లతను 2011లో విడాకులు ఇచ్చి విడిపోయారు. ఆ తర్వాత ఆయన నటి నయనతారతో ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచినా, ఆ బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. అనంతరం ప్రభుదేవా డాక్టర్ హిమాని సింగ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సైతం విడాకులు తీసుకున్న ప్రముఖ సెలబ్రిటీల జాబితాలో ఉన్నారు.
సినీ పరిశ్రమలో వెలుగులు, విజయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో సవాళ్లు ఉంటాయని ఈ ప్రముఖుల జీవితాలు తెలియజేస్తున్నాయి. వివిధ కారణాలతో కొందరి వైవాహిక బంధాలు స్వల్పకాలంలోనే ముగిశాయి.

