బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 10 తెలుగు విజయవంతంగా 58 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్లో భాగంగా వర్షిణి, ముకేశ్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం హైలైట్‌గా నిలవగా.. ఫ్యామిలీ వీక్ ప్రకటనతో ఇంటి సభ్యుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఈ వారం నామినేషన్లలో వర్షిణి.. నరేశ్, శివలను టార్గెట్ చేసింది. నరేశ్ ఇతరుల ప్రభావంలో ఉంటున్నాడని ఆరోపించగా నరేశ్ ఘాటుగా బదులిచ్చాడు. రాంప్రసాద్ కూడా వర్షిణిని నామినేట్ చేస్తూ ఆమె ఆరోపణలను తప్పుబట్టాడు. అమన్ సుధీర్, వర్షిణిలను నామినేట్ చేశాడు. శివ తన నామినేషన్లో ముకేశ్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. ఝాన్సీ ఎలిమినేషన్‌కు ముకేశ్ కారణమని ఆరోపించాడు.
దేబ్జానీ కూడా ముకేశ్‌ను నామినేట్ చేస్తూ అతడి ప్రవర్తనపై మండిపడింది. ఈ క్రమంలో ముకేశ్, కెప్టెన్ త్రిగుణ్ మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు త్రిగుణ్ వర్షిణి ఫొటోను చింపేసి నామినేట్ చేయడం, ముకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఎపిసోడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
వచ్చే వారం ఫ్యామిలీ వీక్ నిర్వహించనున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే కుటుంబ సభ్యులను కలుసుకోవాలంటే ఈ వారం జరిగే పోటీల్లో గెలవాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. విజేతలకు ఫ్యామిలీని కలిసే అవకాశంతో పాటు కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచే ఛాన్స్ కూడా దక్కనుంది.మీ కథ చెప్పండి టాస్క్‌లో త్రిగుణ్ తన తల్లి, భార్య, కూతురు గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. అమన్ తన కుటుంబ కష్టాలను వివరించగా, నీతూ మాస్టర్ తన తల్లి గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. వర్షిణి కూడా తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలను పంచుకుంది.
Also Read:ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం!
చివరగా ముకేశ్ తన అక్క బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయాన్ని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కుటుంబం ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకుంటూ అక్క భర్తకు క్షమాపణలు చెప్పాడు. ఇలా నామినేషన్ల గొడవలతో మొదలైన 58వ ఎపిసోడ్.. కుటుంబ అనుబంధాల ఎమోషనల్ సన్నివేశాలతో ముగిసింది.

