బాలీవుడ్ నటి రాధికా ఆప్టే చేసిన తాజా వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినిమాల్లో తనకు ఎదురైన కొన్ని అనుభవాల గురించి ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో కలిసి నటించిన లెజెండ్ సినిమా పేరు ప్రస్తావించకుండానే ఆమె చేసిన కామెంట్స్ వీడియో వైరల్‌గా మారింది.
ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకున్న రాధికా ఆప్టే.. ఓ తెలుగు సినిమాలో తనకంటే వయసులో చాలా పెద్ద నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా ఆ సినిమాలో తన పాత్రకు మేనమామతో వివాహం జరిగే పరిస్థితి ఉంటుందని…కథ మధ్యలోనే తన పాత్ర మరణిస్తుందని వివరించారు. ఆ కథాంశం తనకు ఏమాత్రం నచ్చలేదని, అలాంటి పాత్రలో నటించడం తనకు అసంతృప్తిని కలిగించిందనే భావనను వ్యక్తం చేశారు.
Also Read:క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్ రిటైర్మెంట్..
అయితే ఆమె తన వ్యాఖ్యల్లో సినిమా పేరు లేదా హీరో పేరు నేరుగా ప్రస్తావించలేదు. కానీ ఆమె చెప్పిన వివరాలు బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాకు సరిపోతున్నాయని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

