హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తుండగా, నస్లేన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా ద్వారా గ్రాండ్ రిలీజ్ కానుంది. ‘సీన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య మాట్లాడుతూ.. అందరికీ థాంక్యూ. లవ్ యు. మనందరం ఒక్కటే. వి ఆర్ వన్ ఫ్యామిలీ. మీరందరూ నాకు అన్‌కండిషనల్ లవ్ ఇచ్చారు. ఈ ఏడాదిలో మిమ్మల్ని కలవడం ఇది మూడోసారి. దీన్ని ఒక బ్లెస్సింగ్‌గా భావిస్తున్నాను. ఈ ఏడాది చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా గురించి మాట్లాడుతున్నారు. కానీ నాగార్జున గారు ఇంతకుముందే ఇతర భాషల డైరెక్టర్స్‌తో కలిసి పనిచేశారు. అన్ని ఇండస్ట్రీలను కలుపుకుంటూ వర్క్ చేసేవారు. మణిరత్నం గారు, ప్రియదర్శన్ గారు, మహేష్ భట్ గారు.. ఇలా ఎంతోమంది దర్శకులతో కలిసి పనిచేశారు. అది ఎప్పుడూ నా మనసులో ఉంటుంది. ‘విశ్వనాథన్ అండ్ సన్స్’లో చాలా భాషలకు చెందిన నటీనటులు కలిసి పనిచేశారు.
హీరోయిన్ నజ్రియా నజీమ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘అంటే సుందరానికి’ సినిమా తర్వాత మరోసారి మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ, ఆదరణ, అభిమానానికి ధన్యవాదాలు. డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అందరూ సూర్య గారిని హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అడుగుతున్నారు. నేను కూడా తోటి ఫ్యాన్‌గా అదే అడుగుతున్నాను. కచ్చితంగా హిట్ కొట్టాలి. అభిమానులుగా మీ అందరం ప్రామిస్ చేస్తున్నాం.. ఇది హ్యాట్రిక్ హిట్ అవుతుంది అన్నారు.
Also Read:రాహుల్ కోసమే RR ట్యాక్స్:అమిత్ షా
నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సూర్య గారి కెరీర్లో ఎన్నో బిగ్ హిట్స్ ఉన్నాయి. ఈ ఏడాది ‘వీరభద్రుడు’, ‘విశ్వనాథన్ అండ్ సన్స్’, ఇప్పుడు ‘సీన్’.. ఈ మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలతో ప్రేక్షకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. కచ్చితంగా ఈ సినిమా సూర్య గారికి హ్యాట్రిక్ అవుతుంది. అలాగే డైరెక్టర్ గారికి కూడా ఇది హ్యాట్రిక్ సినిమా అవుతుంది అన్నారు.

