భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమయ్యారు. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఈ భేటీలో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంపై చర్చించారు.
జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం (G20 FMM) సందర్భంగా అట్లాంటాలో జైశంకర్.. మార్కో రూబియోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని సమీక్షించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ భేటీపై జైశంకర్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించారు. జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం కోసం అట్లాంటాకు వచ్చిన సందర్భంగా ఆతిథ్యం ఇచ్చిన మార్కో రూబియోకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భారత్-అమెరికా ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించినట్లు పేర్కొన్నారు.
Also Read:ట్రంప్‌కు డమ్మీ అభ్యర్థి టెన్షన్!
గురువారం అర్ధరాత్రి సమయంలో అట్లాంటాకు చేరుకున్న జైశంకర్.. జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా రూబియోతో భేటీ అయ్యారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాధాన్యత సంతరించుకుంది.

