BB10:త్రిగుణ్‌కి అదిరే ఆఫర్

2
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 10 తెలుగు విజయవంతంగా 54 రోజులు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ ఇంట్లోని ఎనిమిదో వారంలో అల్టిమేట్ గోట్ కెప్టెన్ కోసం టాస్క్ జరుగుతోంది. గ్రీన్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు కెప్టెన్సీ కంటెండర్లుగా మారారు. ఎల్లో నుంచి గ్రీన్ జోన్‌లోకి వర్షిణి వచ్చింది. ఇక ఈ కెప్టెన్సీ రేసులో ముకేష్, వర్షిణి, త్రిగుణ్, దేబ్జానీ, రాం ప్రసాద్ పోటీ పడ్డారు.

తర్వాత ‘అల్టిమేట్ గోట్’ టైటిల్ కోసం జరిగిన హోరాహోరీ పోరులో త్రిగుణ్ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో త్రిగుణ్ హౌస్‌లో ఉన్నంతకాలం కెప్టెన్సీ కంటెండర్‌గా కొనసాగే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు.

సపోర్టర్స్ ఎంపిక విషయంలో ముకేశ్ వర్గానికి, మిగతా సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, చివరికి శివ, అమన్, వంశీలు సపోర్టర్లుగా వ్యవహరించడంతో త్రిగుణ్ గెలుపు సాధ్యమైంది. గెలిచిన వాళ్లకి థంక్స్ అప్ బిర్యానీ లభిస్తాయి. టీమ్ ఏ లో శివ, ముకేశ్, ఝాన్సీ, రోహిత్, వర్షిణి, సుధీర్, రామకృష్ణ మిగతా వాళ్లు టీం బీ.. త్రిగుణ్ సంచాలక్‌ ఈ గేమ్‌లో టీం ఏ గెలుస్తారు. అందరూ థంస్స్ అప్ తాగుతూ బిర్యానీ తింటూ ఎంజాయ్ చేస్తారు.

అయితే ఎపిసోడ్ చివరిలో ఊహించని మలుపు తిరిగింది. రెడ్ లెవెల్‌లో ఉన్న వారిలో సుధీర్ ఎలిమినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించడంతో హౌస్‌మేట్స్ అందరూ షాకయ్యారు. ముఖ్యంగా వర్షిణి, ముకేశ్, ఝాన్సీ కన్నీరు పెట్టుకున్నారు. సుధీర్‌ను కాపాడుకునేందుకు ముకేశ్ తన స్పెషల్ పవర్‌ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఝాన్సీ తన పవర్‌ను ముకేశ్‌కు తిరిగి ఇవ్వడంతో, ఆ పవర్‌ను ఉపయోగించి ముకేశ్ సుధీర్ ఎలిమినేషన్‌ను రద్దు చేసి కాపాడుకోవడంతో ఎపిసోడ్ ముగిసింది.

Also Read:ట్రంప్‌కు డమ్మీ అభ్యర్థి టెన్షన్!

- Advertisement -