అర్నబ్ తుపాను..అండగా నిలుస్తాం!

4
- Advertisement -

సైక్లోన్ అర్నబ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో మాట్లాడాను అని తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన షా… విపత్తు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చాను అని తెలిపారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక, పునరావాస చర్యలను కొనసాగిస్తున్నాయి. నష్టం ఎంత జరిగిందో అంచనా వేయడానికి, మరింతగా అవసరమైన సహాయాన్ని గుర్తించడానికి అంతర్‌ మంత్రిత్వ కేంద్ర బృందాలను (IMCTs) త్వరలో పంపించనున్నాం అని చెప్పారు.

Also Read:అమాంతం పడిపోయిన గూగుల్ షేర్లు

ప్రజలకు అండగా నిలిచేందుకు వారికి అవసరమైన సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దృఢమైన నిబద్ధతతో ఉంది అని పేర్కొన్నారు.

- Advertisement -