- Advertisement -
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 3-0తో ఆధిక్యంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. వరుసగా మూడు విజయాలతో టీమిండియా సిరీస్‌పై పట్టు బిగించింది.
అభిషేక్ శర్మ 38 బంతుల్లో 11 సిక్స్‌లు, 9 ఫోర్లతో 113 పరుగులు చేయగా వైభవ్ సూర్యవంశీ 4 సిక్స్‌లు,4 ఫోర్లతో 45 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ పోషించారు.
Also Read:CSK:ఐపీఎల్ వ్యూహం రెడీ!
- Advertisement -

