చైనాతో స్వేచ్ఛాయుత, న్యాయబద్ధమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ అవసరాలను తీర్చేందుకు చైనా సరఫరాదారులు ముందుకు రావచ్చని పేర్కొన్నారు. అయితే ఏదైనా ఉత్పత్తి విషయంలో ధరల నిర్ణయం సక్రమంగా లేకపోయినా, న్యాయబద్ధమైన పోటీకి విరుద్ధంగా వ్యవహరించినా.. అందుకు సంబంధించి ఇప్పటికే నిర్దేశించిన న్యాయపరమైన ప్రక్రియను అనుసరిస్తామని స్పష్టం చేశారు.
చైనా నుంచి భారత్‌కు కీలకమైన మధ్యంతర ఉత్పత్తులు, ముడి పదార్థాలు అందుతున్నాయని గోయల్ తెలిపారు. ప్రతి దేశంతోనూ స్వేచ్ఛాయుత, న్యాయబద్ధమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే తమ విధానమని చెప్పారు. భారత్ రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారత వస్తువులు, సేవలకు ఇతర దేశాల్లో మార్కెట్లను పరస్పర ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని గోయల్ చెప్పారు. రానున్న సంవత్సరాల్లో చైనా, ఆసియాన్ ప్రాంతాలకు భారత్ ప్రధాన ఎగుమతిదారుగా ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
బ్రిక్స్ సదస్సు సందర్భంగా కామెరూన్‌లోని యౌండేలో, న్యూఢిల్లీలో తన చైనా ప్రతినిధితో సమావేశాలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య)లో బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
Also Read:తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుందా?
భారత్‌కు చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. అయితే, ఆ దేశంతో వాణిజ్య లోటు పెరుగుతుండటంపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది.2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 7.9 శాతం పెరిగి 127.7 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 118.39 బిలియన్ డాలర్లుగా ఉంది.

