భారత్‌ను కేవలం మార్కెట్‌గా కాకుండా తయారీ, పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా జర్మన్ కంపెనీలు చూస్తున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
సీమెన్స్ హెల్త్‌కేర్, బెర్టెల్స్‌మన్ ఇన్వెస్ట్మెంట్, ఫోక్స్‌వ్యాగన్, స్కోడా తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. జర్మనీకి చెందిన పలు కంపెనీల సీఈవోలు ఇదే సందేశాన్ని తనకు ఇచ్చారని పేర్కొన్నారు.
జర్మనీకి ఉన్న కచ్చితత్వంతో కూడిన సాంకేతిక నైపుణ్యం, పరిశోధనా సామర్థ్యం.. భారత్‌కు ఉన్న విస్తృత ఉత్పత్తి సామర్థ్యం, ప్రతిభావంతులైన మానవ వనరులు కలిస్తే ప్రపంచ భవిష్యత్తు కోసం సరికొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని గోయల్ వివరించారు. ఈ భాగస్వామ్యంతో భవిష్యత్తుకు అవసరమైన ఉత్పత్తుల తయారీ, పరిశోధన, పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు.
Also Read:ప్రాసెస్డ్ ఫుడ్‌తో పెద్దపేగు క్యాన్సర్?
భారత్ అభివృద్ధి ప్రయాణంలో జర్మన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడటమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా భారతదేశంపై ఉన్న దృక్పథాన్ని కూడా మార్చగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానం… భారత్ మార్కెట్ సామర్థ్యం, నైపుణ్యం కలిసివస్తే ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

