దక్షిణాది సినీ పరిశ్రమలో సెన్సేషన్‌గా మారిన రుక్మిణి వసంత్, దర్శకుడు శ్రీ కార్తిక్‌తో చేతులు కలిపారు. వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ కొత్త సినిమా ఇప్పటికే ట్రేడ్ వర్గాలతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచుతోంది. హై కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ కథాంశానికి తల్లీకొడుకుల మధ్య హత్తుకునే భావోద్వేగాలను జోడించి తెరకెక్కించిన ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత శ్రీ కార్తిక్ తెరకెక్కించనున్న నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంలో తన అద్భుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటించనున్నారు. దేవ్ రామనాథ్, వినాయక్ వైద్యనాథన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. ఇందులో రుక్మిణి వసంత్‌ను ‘తారా’గా పరిచయం చేశారు. ఈ వీడియోతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. దర్శకుడు శ్రీ కార్తిక్, నటులు దేవ్ రామనాథ్, వినాయక్ వైద్యనాథన్ కలిసి ‘తారా’ పాత్రను ఖరారు చేయడానికి సమయం మించిపోతోందని చర్చించుకుంటుండగా, వారికి ఓ నోటిఫికేషన్ వస్తుంది. అది వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా ఆసక్తికరమైన సరదా సన్నివేశాలతో సాగిన వీడియో చివర్లో రుక్మిణి వసంత్‌ను పరిచయం చేశారు.
చిత్రాన్ని సిరుని సినీ కార్పొరేషన్, మ్యాడ్బాయ్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాయికృష్ణ గడ్వాల్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిర్మాత జస్వంత్ నడిపల్లితో అనుబంధం ఉన్న సిరుని సినీ కార్పొరేషన్ గతంలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ‘చి ల సౌ’ చిత్రానికి మద్దతుగా నిలిచింది. ఈ సినిమా ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. కంటెంట్‌కు ప్రాధాన్యమిచ్చే సినిమాలు, విభిన్నమైన కథనాలను ప్రోత్సహిస్తూ సిరుని సినీ కార్పొరేషన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
Also Read:చంద్రబాబుది క్రిమినల్ మెంటాలిటీ
దేవ్ రామనాథ్, శ్రీ కార్తిక్ నేతృత్వంలోని మ్యాడ్బాయ్స్ ఎంటర్టైన్మెంట్ విభిన్నమైన, ఒరిజినల్ కథలను రూపొందించే క్రియేటర్ ఆధారిత కంటెంట్ స్టూడియోగా గుర్తింపు పొందింది. వీరు రూపొందించిన పాపులర్ తమిళ వెబ్ సిరీస్ ‘ఐ హేట్ యు – ఐ లవ్ యు’, అవార్డు గెలుచుకున్న షార్ట్ ఫిల్మ్ ‘చైల్డ్‌హుడ్ డైరీస్’ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.
ఈ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కోసం గత ఏడాదిన్నర కాలంగా ఈ సినిమాను రూపొందించడానికి తాము చేసిన ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఇన్స్టాగ్రామ్ ప్రత్యేక డాక్యు-డ్రామా రీల్ సిరీస్‌ను చిత్రబృందం రూపొందించింది. తాజాగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియో ఆ సిరీస్‌లో ఒక కీలకమైన మైలురాయిగా నిలిచింది.

