టిబెట్‌లో భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందగా 100 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
రాత్రి 10 గంటల 33 నిమిషాల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంప తీవ్రతకు పలు ఇళ్లు నేలమట్టమైనట్లు సమాచారం. ఇప్పటివరకు దాదాపు 500 ఇళ్లు కూలిపోయినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల తొలగింపు, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read:పాలమూరుకు కరువు..రేవంత్ వైఫల్యమే

