బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో డే 46, ఎపిసోడ్ 47 ఆసక్తికరంగా సాగింది. ఎల్లో జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లకు గ్రీన్ జోన్‌లోకి వెళ్లే అవకాశం కల్పిస్తూ బిగ్‌బాస్ ‘గోట్ ఆఫ్ ఎండ్యూరెన్స్’ టాస్క్‌ను నిర్వహించాడు. అయితే ఈ టాస్క్‌లో చివరి వరకు నిలబడిన నరేష్ విజేతగా నిలిచినప్పటికీ.. బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్‌తో అసలు కథ మారిపోయింది.
ఈ టాస్క్‌కు శ్వేతను సంచాలకురాలిగా నియమించారు. రెడ్ టీమ్ సభ్యులు బిగ్‌బాస్ సూచించిన విధంగా ఎల్లో టీమ్ కంటెస్టెంట్లకు వెయిట్స్ తగిలించాలి. చివరి వరకు బరువులను మోస్తూ నిలబడినవారు ఈ పోటీలో తమ సత్తా చాటాల్సి ఉంది. అయితే కొందరు కంటెస్టెంట్లు శివ్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణిలను లక్ష్యంగా చేసుకున్నారు. వర్షిణి మొదట్లోనే బరువును మోయలేక కిందపడిపోగా, శివ్ సుమారు 32 కిలోల బరువును మోసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఆ తర్వాత శివ్, త్రిగుణ్, నీతూ, ముకేష్, రామ్ ప్రసాద్ ఒక్కొక్కరుగా టాస్క్ నుంచి తప్పుకున్నారు. చివరకు అమన్, నరేష్ మాత్రమే మిగిలారు. ఈ సమయంలో ఎక్కువ మంది అమన్‌పై వెయిట్స్ వేస్తూ అతడిని టార్గెట్ చేశారు. మరోవైపు నరేష్‌కు తక్కువ బరువు వేయడంతో అతడు చివరి వరకు నిలబడ్డాడు.
టాస్క్ మధ్యలో ముకేష్, శివ్ మధ్య వ్యక్తిగత వ్యాఖ్యలతో వివాదం తలెత్తింది. శివ్‌ను ఉద్దేశించి ముకేష్ చేసిన వ్యాఖ్యలతో అతడు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు, తనను కావాలనే టార్గెట్ చేశారని అమన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
చివరకు నరేష్ నిలబడటంతో అతడే గోట్ అవుతాడని అందరూ భావించారు. కానీ కంటెస్టెంట్లు సేఫ్ గేమ్ ఆడారని పేర్కొన్న బిగ్‌బాస్ అసలు ట్విస్ట్ ఇచ్చాడు. అత్యధిక బరువును మోసిన అమన్‌తో పాటు, మహిళా కంటెస్టెంట్లలో ఎక్కువ బరువును మోసిన నీతూ, ఎక్కువసేపు బరువులను మోస్తూ నిలిచిన దేబ్జానీలను గోట్స్‌గా ప్రకటించాడు. ఈ ముగ్గురికీ వచ్చే వారం నామినేషన్ల నుంచి ఇమ్యూనిటీ లభించింది.బిగ్‌బాస్ నిర్ణయంతో అమన్, నీతూ, దేబ్జానీలు సంతోషించగా.. నరేష్ తీవ్రంగా బాధపడ్డాడు.
Also Read:పాలమూరుకు కరువు..రేవంత్ వైఫల్యమే

