పారా గేమ్స్‌..భారత్ ఖాతాలో రజతం

2
- Advertisement -

ఆసియా పారా గేమ్స్‌ 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధిస్తున్నారు. మహిళల పారా ఆర్చరీ కాంపౌండ్ డబుల్స్‌ విభాగంలో భారత అథ్లెట్లు శీతల్ దేవి, పాయల్ నాగ్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు పురుషుల 100 మీటర్ల టీ35 పరుగులో అనుభవ్ చౌదరి కాంస్య పతకాన్ని సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు.

మహిళల కాంపౌండ్ డబుల్స్‌ ఫైనల్‌లో చైనాకు చెందిన జు ష్యూకింగ్, జావో జింగ్ జోడీతో శీతల్ దేవి, పాయల్ నాగ్ తలపడ్డారు. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో భారత జోడీ 141-150 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో స్వర్ణ పతకం చేజారినా రజతంతో సరిపెట్టుకుంది. ఈ పోటీల్లో భారత్‌కు పారా ఆర్చరీ విభాగంలో ఇదే తొలి పతకం కావడం విశేషం.

Also Read:రామాయణం..విజనరీ మూవీ

ఇక పురుషుల 100 మీటర్ల టీ35 ఫైనల్‌లో అనుభవ్ చౌదరి 12.72 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచాడు. దీంతో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఈ ప్రదర్శనలో అతను తన వ్యక్తిగత అత్యుత్తమ సమయాన్ని కూడా నమోదు చేశాడు.

భారత పారా అథ్లెట్లు అంతర్జాతీయ వేదికపై చూపుతున్న ప్రతిభ దేశానికి మరింత గుర్తింపు తెస్తోంది. శారీరక సవాళ్లను అధిగమిస్తూ పతకాలు సాధిస్తున్న క్రీడాకారులపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -