BB10:12 మంది నామినేట్!

10
- Advertisement -

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఏడోవారం నామినేషన్లు హౌస్‌లో తీవ్ర వాగ్వాదాలకు దారితీశాయి. డే 44, 45 ఎపిసోడ్లలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. త్రిగుణ్, రోహిత్, వర్షిణి, శివ్‌ల మధ్య జరిగిన వాదనలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి.

మొదట త్రిగుణ్‌తో మాట్లాడిన వంశీ.. రోహిత్ కంటే తనకే హౌస్‌లో ఉండే అర్హత ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించాడు. మరోవైపు, షాలిని వెళ్లిపోవడం తనకు బలహీనత కాదని, ఆమె తనకు రీఛార్జ్ పాయింట్ అని రోహిత్ చెప్పాడు.

నామినేషన్లలో అమన్.. శివ్‌ను టార్గెట్ చేశాడు. గంట ఎపిసోడ్ చూసి హౌస్‌లోకి వచ్చారని విమర్శించగా, బయట ప్రేక్షకులు కూడా ఎపిసోడ్లు చూసే ఓట్లు వేస్తారని శివ్ కౌంటర్ ఇచ్చాడు. అనంతరం శ్వేత.. త్రిగుణ్‌ను నామినేట్ చేస్తూ, గేమ్‌లో నమ్మకద్రోహం చేశాడని ఆరోపించింది. దీనికి త్రిగుణ్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.

వర్షిణి, నీతూ మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. నీతూ తనపై చేసిన ఆరోపణలను వర్షిణి తిప్పికొట్టింది. సుధీర్, త్రిగుణ్ మధ్య కుటుంబంపై చేసిన ప్రమాణాలు, నైతికత అంశాలపై మాటల యుద్ధం సాగింది. రామకృష్ణ, ఝాన్సీ నామినేషన్లలోనూ ఆసక్తికరమైన కౌంటర్లు వినిపించాయి.

Also Read:రామాయణం..విజనరీ మూవీ

చివర్లో కెప్టెన్ రామ్ ప్రసాద్‌కు బిగ్‌బాస్ ప్రత్యేక అధికారం ఇచ్చాడు. నామినేషన్‌లో లేని అమన్, ముకేష్, నరేష్, దేబ్జానీలలో ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని సూచించాడు. దీంతో రామ్ ప్రసాద్ అమన్ మసూద్‌ను ఎంచుకున్నాడు.

ఈ వారంలో మొత్తం 12 మంది నామినేట్ అయ్యారు. దక్షి, వర్షిణి, రోహిత్, సుధీర్, త్రిగుణ్, నీతూ, రామకృష్ణ, శివ్, ఝాన్సీ, శ్వేత, వంశీ, అమన్‌లు ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఇక ఈ వారం ఎవరు బయటకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -