స్మృతి రికార్డు షఫాలీ బ్రేక్!

2
- Advertisement -

భారత మహిళా క్రికెట్ జట్టు యువ ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధికంగా 50కి పైగా పరుగుల స్కోర్లు సాధించిన భారత మహిళా క్రికెటర్ల జాబితాలో స్మృతి మంధానను అధిగమించింది. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో మెరుపు అర్ధసెంచరీ సాధించి ఈ ఘనతను అందుకుంది.

రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో అక్టోబర్ 18న భారత్, జింబాబ్వే మహిళా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 102 పరుగులకే పరిమితమైంది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ కైవసం చేసుకుంది.

లక్ష్య ఛేదనలో షఫాలీ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. కేవలం 25 బంతుల్లోనే 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమె ఇన్నింగ్స్‌తో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అద్భుత ప్రదర్శనకు గాను షఫాలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో షఫాలీ 2026లో తన 50కి పైగా పరుగుల స్కోర్ల సంఖ్యను తొమ్మిదికి చేర్చింది. దీంతో 2024లో ఎనిమిది సార్లు ఈ ఘనత సాధించిన స్మృతి మంధానను వెనక్కి నెట్టింది.

ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన మహిళా క్రికెటర్లు:

9 – షఫాలీ వర్మ (భారత్), 2026

8 – స్మృతి మంధాన (భారత్), 2024

7 – మిథాలీ రాజ్ (భారత్), 2018

7 – నటాషా మైల్స్ (హాంకాంగ్), 2026

Also Read:NCO సమావేశానికి రాజ్‌నాథ్

జింబాబ్వేపై ఈ విజయంతో భారత్ సిరీస్‌ను సొంతం చేసుకోగా, షఫాలీ తన అద్భుత ఫామ్‌తో భారత మహిళా క్రికెట్‌లో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

- Advertisement -