ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

4
- Advertisement -

వైసీపీ అధినేత, మాజీ సీఎంల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జెన్‌ జీ (Gen Z) యువతను తమ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటూ, వారి జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. యువత ఆశయాలు, ఆకాంక్షలను పక్కనబెట్టి వారిని తప్పుడు మార్గంలోకి మళ్లిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

జెన్‌ జీ యువత ఆకాంక్షలు ఏంటో ఆలోచించకుండా, క్రిమినల్స్‌తో కలిపి వారి జీవితాలను నాశనం చేసేందుకు యత్నిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలతో ఉన్న యువతను గుర్తించి, వారి ద్వారా నేరాలు చేయిస్తూ కరుడుగట్టిన నేరగాళ్లుగా తయారు చేస్తున్నారు. ఇది స్వచ్ఛమైన ఫ్యాక్షనిస్టుల నైజమని, ప్రస్తుతం వైఎస్సార్సీపీ అదే తరహా రాజకీయం చేస్తోందని విమర్శించారు.

గొడ్డలి పార్టీ అధినేత వచ్చి, ప్రెస్ మీట్ పెట్టి నీతులు చెప్పి వెళ్లారు. తాను చెప్పిందే చట్టం అన్నట్లుగా ఆయన తీరు ఉంది. స్థానిక ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే వైఎస్సార్సీపీ రాష్ట్రంలో అల్లర్లను సృష్టిస్తోంది. ఎన్నికల కమిషనర్‌ను బెదిరించే రీతిలో జగన్ మాట్లాడారని ఆరోపించారు. కుప్పం, పిఠాపురంలో వైసీపీ తరఫున అత్యధికంగా నామినేషన్లు వేయించారని గుర్తుచేశారు. గత వైసీపీ పాలనలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండేవి కాదని ప్రశ్నించారు. తమ పార్టీ శ్రేణులపై దాడులు చేసి, తిరిగొచ్చి టీడీపీనే దాడులు చేసిందని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించారు. రాష్ట్రంలో అల్లర్లకు వైఎస్సార్సీపీనే కారణమని పేర్కొంటూ, జగన్ చేస్తున్న రాష్ట్రపతి పాలన డిమాండ్‌ను తిప్పికొట్టారు. గత ఎన్నికల్లో జరిగిన మారణకాండ, అక్రమాలపై ముందుగా జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -