BB10:ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్!

6
- Advertisement -

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆరో వారం ఎలిమినేషన్ ఉత్కంఠ రేపింది. ఇంటి సభ్యులంతా షాలినీ బయటకు వెళ్లిపోయిందని భావించినప్పటికీ  చివరి నిమిషంలో నాగార్జున ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆమెను ఎలిమినేట్ చేయకుండా సీక్రెట్ రూమ్‌కు పంపించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. దీంతో షాలినీ తిరిగి ఇంట్లోకి ఎప్పుడు వస్తుంది? వచ్చిన తర్వాత తన ఆటతీరును మార్చుకుంటుందా? అనే చర్చ మొదలైంది.

ఆదివారం (అక్టోబర్ 18) ఎపిసోడ్‌లో సండే ఫండే కార్యక్రమం సందడిగా సాగింది. ఇందులో భాగంగా నిర్వహించిన డ్యాన్స్ ఫేస్ ఆఫ్‌లో ఇంటి సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రామ్ ప్రసాద్ మార్కులు వేయగా, నాగార్జున తుది నిర్ణయం తీసుకున్నారు. చివరకు నరేష్ టీం విజయం సాధించింది. అమన్ తన డ్యాన్స్‌తో ఆకట్టుకోగా, మిగతా కంటెస్టెంట్లు కూడా తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఆ తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లపై ఓజీ సభ్యుల అభిప్రాయాలను నాగార్జున అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో దక్షిపై ఎక్కువ మంది తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఆమెకు పనిష్మెంట్ విధిస్తూ రెండు వారాల పాటు నామినేషన్లలో ఉండాల్సి ఉంటుందని ప్రకటించారు. ఇక మెజారిటీ ఓట్లతో రామ్ ప్రసాద్ స్టార్ ప్లేయర్‌గా నిలిచాడు.

చివరగా వర్షిణి, షాలినీ ఎలిమినేషన్ ప్రక్రియలో మిగిలారు. షాలినీ వెళ్లిపోవాల్సి వస్తుందని తెలియడంతో రోహిత్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ఆటపై దృష్టి పెట్టి కప్ గెలవాలని షాలినీ అతడికి సూచించింది. స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత కూడా రోహిత్‌తో తన అనుబంధం గురించి ఆమె భావోద్వేగంగా మాట్లాడింది.

అయితే, నాగార్జున సరదా ప్రశ్నలతో షాలినీని ఆటపట్టించారు. అనంతరం ఇంటి సభ్యులకు వీడ్కోలు చెప్పి వెళ్లిపోతున్న సమయంలో మళ్లీ పిలిచి, ఆమె ఎలిమినేట్ కాలేదని, సీక్రెట్ రూమ్‌లోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. దీంతో షాలినీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Also Read:జనవరి 12 విడుదల..అప్‌డేట్

- Advertisement -